For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలయ్య-చెర్రీ ఢీ అంటే ఢీ అన్నట్లుగా: దసరాకు రిలీజైన మూడు టీజర్లు ఇవే(వీడియోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఈసారి దసరా స్టార్ హీరోల అభిమానుల్ని ఓ రకంగా ఆనందపరిచింది, మరో విధంగా నిరాశపరిచింది. ఈ దసరాకు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయేమో చూసి ఆనందపడదాం అని ఎదురుచూసిన సినిమా అభిమానులు నిరాశపడ్డారనేది వాస్తవం. అయితే అదే సమయంలో పెద్ద హీరోలైన రామ్ చరణ్, బాలకృష్ణ చిత్రాల టీజర్లు విడుదల అయ్యి ఆనందపరిచాయి.

  వాస్తవానికి రామ్‌చరణ్‌ 'ధృవ' దసరాకి రిలీజ్ అవుతుందనుకున్నారు గానీ, రామ్‌చరణ్‌ టీజర్‌తో సరిపెట్టాడు. 'ధృవ' టీజర్‌ దసరా రోజే విడుదలయ్యింది. దాంతోపాటుగా, సంక్రాంతికి విడుదల కావాల్సిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాకి సంబంధించి టీజర్‌ని విడుదల చేసారు.

  దాంతో ఓ ప్రక్కన నందమూరి అభిమానులు, మరో ప్రక్క మెగాభిమానులలో పండగ ఉత్సాహం కనిపించింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అయితే పోటీ వాతావరణం కనిపించింది. రెండు వర్గాల అభిమానులు పోటీ పడి మరీ తమ హీరోల టీజర్లను షేర్ చేయటం , మరో ప్రక్కన పోటీ హీరో టీజర్ ని ట్రోల్ చేయటం కనిపించింది.

  అయితే మధ్యలో శర్వానంద్ తాజా చిత్రం శతమానం భవతి టీజర్ కూడా రిలీజయ్యింది. ఈ టీజర్ కు సైతం మంచి మార్కులే పడ్డాయి. మూడు టీజర్లను మీరు ఈ క్రింద చూడవచ్చు. అలాగే ఏ టీజర్ బాగుందో ఇక్కడ కామెంట్ కాలంలో పంచుకోవచ్చు.

  నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చూసిన బాలయ్య అభిమానులు ఇప్పటికే చాలా ఆనందంగా ఉన్నారు. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియా కథానాయిక పాత్ర పోషిస్తోంది. అమరావతిని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా క్రిష్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

  బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ టీజర్ వచ్చేసింది. 'సమయం లేదు మిత్రమా.... శరణమా... రణమా' అంటూ సాగిన ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

  ఇక మెగా పవర్ స్టార్ రాం చరణ్ చేస్తున్న తాజా చిత్రం ధ్రువ. తమిళ సూపర్ హిట్ మూవీ తని ఒరువన్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత చెర్రి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కేక పెట్టించిన చరణ్ ఇప్పుడు ధ్రువగా రాబోతున్నాడు.

  ఇక ఈ రోజు రిలీజ్ అయిన టీజర్ అయితే చెర్రి గ్రాండ్ లుక్ తో అదరగొట్టాడు. అంతేకాదు నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారక్టర్ తెలుస్తుంది.. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది అని డైలాగ్ చెప్పాడు. సినిమా మొత్తం మైండ్ గేం తో నడుస్తుందని తెలిసిందే. ఆల్రెడీ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ గా ధ్రువ ఈసారి మెగా ఫ్యాన్స్ కు పండుగ తెస్తుందని నమ్ముతున్నారు.

  శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'శతమానం భవతి'. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తోంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం.

  మూడు తరాలకు సంబంధించిన కథతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, ప్రకాష్‌రాజ్‌, ఇంద్రజ, శివాజీ రాజా, ప్రవీణ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్‌ స్వరాలు అందిస్తున్నారు.

  English summary
  Three teasers released in Telugu For Dasara. Now in FB and Twitter it's fans war ..Dhruva Teaser v/s Gautamiputra Satakarni Teaser.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X