»   » అమరావతిలో తొలి సినీసందడి: బాలయ్యతో ప్రారంభం

అమరావతిలో తొలి సినీసందడి: బాలయ్యతో ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిక్టేటర్' మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరో వైపు ఈ నెల 20న ఈ చిత్ర ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏపీ కొత్తరాజధాని అమరావతిలో వేడుక జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయమై దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ అమరావతిలో జరుగుతున్న తొలి సినిమా వేడుక ఇదే, దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

డిక్టేటర్ లో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కథానుసారం మరో నాయికకు కూడా స్థానం ఉంది. ఈ పాత్రకు అక్షను ఎంపిక చేశారు. 'రైడ్', 'కందిరీగ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్ష కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చే విధంగా ఈ పాత్ర ఉంటుందని చిత్రబృందం తెలిపింది.


సినిమా గురించి ఆ మధ్య ప్రెస్ మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ.... ‘డిక్టేటర్' అనే సినిమా నా కెరీర్లోనే మోస్ట్ స్టైలిష్ మూవీ అవుతుంది. ఇదివరకూ అభిమానులు నన్ను చూడని ఓ సరికొత్త రోల్ ని శ్రీవాస్ నాకోసం డిజైన్ చేసాడు. ఆ పాత్ర కోసం 12కేజీల బరువు కూడా తగ్గానని' తెలిపాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.


Dictator audio launch in grand way in Amaravathi

దర్శకుడు మాట్లాడుతూ..''నా తొలి చిత్రం'లక్ష్యం' పూర్తయిన వెంటనే బాలకృష్ణగారితో సినిమా చేయాలనుకొన్నా. కానీ అప్పట్లో కుదరలేదు. అది ఒక రకంగా మంచికే అయ్యింది. ఇప్పుడు బాలకృష్ణగారి సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతోపాటు, నిర్మాణంలోనూ భాగం పంచుకొనే అవకాశం దొరికింది. బాలకృష్ణ ఇదివరకు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు చేశారు, అభిమానుల్ని అలరించే చిత్రాలూ చేశారు. మేం ఈ సినిమాని ప్రతి అభిమాని తమ కుటుంబంతో కలసి చూసేలా తీయబోతున్నాం. బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్ర పోషిస్తున్నారు. ఆయన 99వ సినిమా కాబట్టి మరింత బాధ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తొలిసారి తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇదే'' అన్నారు దర్శకుడు.


ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Audio launch event of Balakrishna's Dictator will be held on the 20th of December. As reported earlier, the audio will be launched in Amaravathi, the new capital of Andhra Pradesh.
Please Wait while comments are loading...