బాలయ్య ‘డిక్టేటర్’:గంగంగం గణేషా ఫుల్ సాంగ్ ఇదే...
హైదరాబాద్: బాలయ్య 99వ మూవీ ‘డిక్టేటర్'లోని ఓ సాంగును వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేషుడి సన్నిధిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గంగంగం గణేషా జన మానస నిత్య నివాస.. అంటూ సాగే ఈ పాట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. థమన్ ఈ పాటను కంపోజ్ చేసాడు. ఆ పాటను మీరూ వినండి...
ఈ సినిమాను జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. రీసెంట్ గా బాలకృష్ణపై హైదరాబాద్ లో ఇంట్రడక్షన్ సాంగ్ తీసారు. ఈ చిత్రంలో బాలకృష్ణని శ్రీవాస్ సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారు. బాలయ్య పలికే సంభాషణలు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచబోతున్నాయి.
తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్, రవికిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వీ, కాశీవిశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు.

ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.


Click it and Unblock the Notifications











