»   » బాలకృష్ణ కు ‘డిక్టేటర్‌’ టీమ్ బర్తడే విషెష్ (వీడియో)

బాలకృష్ణ కు ‘డిక్టేటర్‌’ టీమ్ బర్తడే విషెష్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఈరోజు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా..ఆయన తాజా చిత్రం ‘డిక్టేటర్‌' టీమ్ ఆయనకు బర్తడే విషెష్ ని తెలియచేసింది. నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా‘డిక్టేటర్‌' షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. బాలయ్యకు ఇది 99వ సినిమా. హీరోయిన్‌గా అంజలి నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ టీమ్ చెప్పిన విషెష్ ని ఈ క్రింద వీడియోలో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

డిక్టేటర్ విషయానికి వస్తే...

బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ‘డిక్టేటర్'అనే భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో బాలయ్య ఆహార్యం వేషధారణ సరికొత్తగా ఉండేలా సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమాగా రూపొందుతోంది.

'Dictator' Movie Team Birthday Wishes To Balakrishna

బాలకృష్ణ మాట్లాడుతూ ....కుటుంబ బంధాలు, యాక్షన్, వినోదం అన్ని సమపాళ్లలో మేళవించిన చిత్రమిది. కోన వెంకట్, గోపీమోహన్ చక్కటి కథను అందించారు. కొత్త టీమ్‌తో పనిచేయటం ఆనందంగా ఉంది .దర్శకుడు శ్రీవాస్ చెప్పిన కథలో కొత్తదనం ఉండడంతో చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని, కోన వెంకట్, గోపీ మోహన్, రత్నం, శ్రీధర్ సీపానలు ఈ చిత్రంకోసం పనిచేస్తున్నారని, యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతుందని తెలిపారు.

ప్రేక్షకులు, అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలనుకుంటారో అలా ఈ చిత్రం రూపొందనుందని ఈరోస్ సునీల్‌లుల్లా తెలిపారు. ఈనెల 29న ప్రారంభంకానున్న యాక్షన్ ఎమోషనల్ డ్రామా అంశాలతో రూపొందే డిక్టేటర్ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని, ఇప్పటివరకు బాలయ్యను చూడని విధంగా వైవిధ్యంగా ఈ చిత్రంలో చూపనున్నామని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు.

అలాగే...శ్రీవాస్ మాట్లాడుతూ బాలకృష్ణను సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. కథ, కథనాలు నవ్యరీతిలో సాగుతాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సహనిర్మాతగా కొనసాగనుండటం సంతోషంగా ఉంది. మరో కథానాయికను త్వరలో ఎంపికచేస్తాం అని తెలిపారు.

అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Above video is ...'Dictator' Movie Team Birthday Wishes To Balakrishna.
Please Wait while comments are loading...