»   » నేను పవన్ కళ్యాణ్ ని ఏ కామెంటూ చేయలేదు

నేను పవన్ కళ్యాణ్ ని ఏ కామెంటూ చేయలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నేను పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయటమేంటి...ఆయనంటే నాకు గౌరవం... అసలు ఆయన ప్రసక్తే ఎక్కడా తేలేదు అంటూ మొత్తుకుంటోంది హన్సిక. ఆమె పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేస్తూ ఇంటర్వూ ఇచ్చిందని తమిళ పత్రికల్లో వచ్చింది. దాంతో అది తెలుగు మీడియాలోనూ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. ఈ నేపధ్యంలో వాటిని ఖండించింది. ఇంతకీ ఆమె తమిళ పత్రికల్లో ఇంటర్వూ ఇచ్చిందని చెప్పబడుతున్న దాంట్లో ఏముందంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

"సోషల్ సర్వీస్ చెయ్యాలంటే పవన్ కళ్యాణ్ లాగో మరొకరిలాగో రాజకీయాల్లోకి లోకి రావాల్సిన పనిలేదు " అందంటూ అక్కడ మీడియా రాసుకొచ్చింది. ఈ నేపధ్యంలో పవన్ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. తెలుగు మీడియా సైతం అత్యుత్సాహంగా ఈ విషయమై వార్తలు రాసేసింది. ఈ నేపధ్యంలో ఆమె వివరణ ఇచ్చింది.

"ఓ మైగాడ్.. కొంతమంది నేను పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేసానని అంటున్నారు. ఈ విషయమై వివరణ ఇస్తున్నాను..నేను ఆయన్ని మెన్షన్ చేస్తూ ఎక్కడా ఇంటర్వూ ఇవ్వలేదు. అదంతా రూమర్స్..ఆ పత్రికల వాళ్లు వండి వార్చిన వార్తే. ఆయనంటే నాకు చాలా గౌరవం...ఆయన చేసే పనులకు నేను అభిమానిని. నేను మిగతా వాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రూమర్ ని ఇక్కడితే ఆపేయండి.. ", అంది హన్సిక.

ఆ విషయం ప్రక్కన పెడితే..

Didn't Commented On Pawan Sir:Hansika

''అందగత్తెలకు చిత్రసీమలో స్థానం దొరకడం సులభమేమో? కానీ అందంతోనే కెరీర్‌ వెళ్లదీయాలంటే కుదరదు.. అభినయం లేని అందం రాణించదు..'' అంటోంది హన్సిక. తొలి చిత్రం 'దేశముదురు'లో సిమ్లా యాపిల్‌లా కనిపించి ఆకట్టుకొంది. అప్పటి నుంచీ కుర్రకారు హృదయాల్ని దోచుకొంటూనే ఉంది.

చిత్రసీమలో అందానికి ప్రాముఖ్యం ఎంత? అని హన్సికను అడిగితే ''అందంగా ఉంటే హీరోయిన్స్ అయిపోవచ్చు అనుకుంటారంతా. కానీ అదొక్కటే సరిపోదు. స్కిన్‌షోతో ఎంతో కాలం నెట్టుకురాలేం. చాలామంది హీరోయిన్స్ తో పోలిస్తే నేను అందంగానే ఉంటాను. దాంతో పాటుగా సినిమా సినిమాకు ఎంతో కొంత నేర్చుకొన్నా. నా తొలి సినిమాలోని నటనకు, ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మన ఆహార్యం, నడవడిక, ప్రవర్తన, ఇవన్నీ.. కెరీర్‌కు కీలకం అవుతాయి. ఆ తరవాత అదృష్టమూ సహాయం చేస్తుంది'' అంటోంది.

English summary
"Oh my god. Few say I have commented on Pawan Kalyan sir. Let me make it clear I haven't given any interview mentioning sir. It is all cooked up!! I respect him immensely and I'm a fan of his work. I request all the others to stop with this vague rumour (sic)", said Hansika.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu