Don't Miss!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
గూగూల్‌లో టాప్ 2020: దిల్ బేచారా, ఆకాశమే నీ హద్దురా కోసం విపరీతంగా శోధించిన నెటిజన్లు
హిందీ చిత్ర పరిశ్రమ గతంలో ఎన్నడూలేని విధంగా 2020 సంవత్సరంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభించడంతో థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులకు, సినీ ప్రముఖులకు నిరాశే మిగిలింది. దాదాపు 9 నెలలపాటు సినిమా పరిశ్రమ మూగబోయింది. షూటింగులు, సినిమాల ప్రదర్శనలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఇప్పడిప్పుడే సినిమాల షూటింగులతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ కళకళలాడుతున్నది.
అయితే సినిమా పరిశ్రమ, థియేటర్ల మూసివేత కొనసాగుతున్న సమయంలో ఓవర్ ది టాప్ (ఓటీటీ) ఫ్లాట్‌ఫాంలకు అత్యంత ప్రేక్షకదారణ దక్కింది. బాలీవుడ్‌తోపాటు ప్రాంతీయ సినిమా పరిశ్రమలకు సంబంధించిన సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో దిల్ బేచారా, సూరారై పొట్ట్రూ, తానాజీ, శకుంతలదేవి, గుంజన్ సక్సేనా, లక్ష్మి, సడక్ 2, గులాబో సితాబో ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యాయి.

అయితే 2020 సంవత్సరంలో గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసిన చిత్రాల్లో ఓటీటీ ద్వారా రిలీజ్ అయిన చిత్రాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు రిలీజైన భాగీ 3, ఎక్ట్రాక్షన్ చిత్రాలతోపాటు లాక్‌డౌన్‌లో రిలీజైన దిల్ బేచారా, సూరారై పొట్ట్రూ, తానాజీ, శకుంతలదేవి, గుంజన్ సక్సేనా, లక్ష్మి, సడక్ 2, గులాబో సితాబో చిత్రాల గురించి ప్రేక్షకులు గూగూల్‌లో ఎక్కువగా శోధించినట్టు ఆ సంస్థ తమ గణాంకాలను వెల్లడించింది. అయితే దిల్ బేచారా, సురారై, తానాజీ పొట్రూ తప్ప మిగితా చిత్రాలన్నీ దాదాపు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే కావడం గమనార్హం.