»   » మా విజయాన్ని ఓర్వలేక పోతున్నారు.... దిల్ రాజు కామెంట్స్ ఎవరిపై?

మా విజయాన్ని ఓర్వలేక పోతున్నారు.... దిల్ రాజు కామెంట్స్ ఎవరిపై?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు పైరసీ అంటే కొందరు డబ్బు సంపాదన కోసం చేసే ఓ అక్రమ వ్యాపారం. అప్పట్లో ఇంటర్నెట్‌కు ఆదరణ ఇంతగా లేదు కాబట్టి.... సీడీలు, వీసీఆర్ రూపంలో పైరసీ తయారు చేసి దొంగచాటుగా అమ్మేవారు. అయితే రాను రాను పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీడీలు, వీసీఆర్‍‌ల కాలం పోయింది.

తర్వాత ఇంటర్నెట్ బాగా వాడకంలోకి వచ్చాక అంతటా ఆన్ లైన్ పైరసీ జోరు పెరిగింది. నిన్న మొన్నటి వరకు టోరంట్ లాంటి సైట్లకు పైరసీ అమ్మేసి డబ్బు సంపాదించడం లాంటివి చేసేవారు. స్మార్ట్ ఫోన్ల హవా, సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన తర్వాత పైరసీ రూపు రేఖలే మారిపోయాయి. ఇపుడు డైరెక్టుగా ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటి సైట్లలో డైరెక్టుగా పైరసీ అప్ లోడ్ చేస్తున్నారు.


విద్వేషాలు తీవ్రం

విద్వేషాలు తీవ్రం

ఒకప్పుడు సినిమా హీరోల మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఇప్పటికీ అది లానే ఉంది. అయితే అభిమానులే ఒకరిపై ఒకరు విద్వేషాలు పెంచుకుని బద్దశత్రువుల్లా తయారవుతున్నారు. వాడి హీరో సినిమా హిట్టు కావొద్దు.... వాడు మన ముందు కాలర్ ఎగరవేసే పరిస్థితి రావొద్దు అనే స్థాయికి విద్వేషాలు తీవ్రం అయ్యాయి.


దుష్ట సంస్కృతి

దుష్ట సంస్కృతి

ఈ క్రమంలోనే తమ ప్రత్యర్థివర్గం అభిమానుల హీరో సినిమా ఆడకుండా సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం, పైరసీకి పాల్పడటం లాంటివి చేస్తున్నారు. ‘డిజె' సినిమా విషయంలో ఈ దుష్ట సంస్కృతి మరింత ఎక్కువైంది.


ఓర్వలేక పోతున్నారు.

ఓర్వలేక పోతున్నారు.

దువ్వాడ జ‌గ‌న్నాథమ్' సినిమాను ప‌లువురు ఆన్‌లైన్‌లో ఉంచడంతో ఈ రోజు నిర్మాత దిల్‌ రాజు, ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌ హైద‌రాబాద్‌లోని సైబ‌ర్ క్రైం పోలీసుల‌కి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ... డీజేకి వ‌స్తోన్న క‌లెక్ష‌న్ల‌ను చూసి కొంద‌రు ఓర్వ‌లేక‌పోతున్నారని, అందుకే త‌మ‌ను దెబ్బ‌తీయాల‌ని ఆన్‌లైన్‌లో ఈ సినిమాను పోస్ట్ చేస్తున్నార‌ని అన్నారు. ఫేస్‌బుక్‌తో పాటు యూ ట్యూబ్‌లో ఈ సినిమా హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న అంశంపై తాము పోలీసుల‌కి ఫిర్యాదు చేశామ‌ని వివ‌రించారు.


మన హీరో సినిమా ఆడాలి, పక్కోడి సినిమా పోవాలా? ‘డిజె' మేకర్స్ ఆవేదన!

మన హీరో సినిమా ఆడాలి, పక్కోడి సినిమా పోవాలా? ‘డిజె' మేకర్స్ ఆవేదన!

మన హీరో సినిమా ఆడాలి, పక్కోడి సినిమా పోవాలా? ‘డిజె' మేకర్స్ ఆవేదన వ్యక్తి చేశారు.


పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Allu Arjun and Pooja hedge starrer ‘DJ – Duvvada Jagannadham’ faced a major problem as the film was leaked on a lot of websites. Producer Dil Raju and director Harish Shankar, who felt that such evil deeds can hamper the collections, reported the commissioner to take action to prevent piracy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu