»   » పవన్ కళ్యాణ్‌కి భయపడి కాదు : దిల్ రాజు

పవన్ కళ్యాణ్‌కి భయపడి కాదు : దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఎవడు' సినిమా ఈ నెల 31న విడుదలవ్వాల్సి ఉండగా....తాజాగా ఆగస్టు 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో పవర్ స్టార్ సినిమాకు భయపడే ఈ వాయిదే వేసారనే ప్రచారం మొదలైంది.

ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు స్పందించారు. 'పవన్ కళ్యాణ్‌కు భయపడే రామ్ చరణ్ వెనక్కి తగ్గాడు అనడం కరెక్టుకాదు. కళ్యాణ్ బాబాయ్. చరణ్ అబ్బాయ్. బాబాయిని అబ్బాయి గౌరవిస్తాడు కానీ భయపడడు. ఏ సినిమా అయినా తెరపై చూస్తేనే సత్తా ఏమిటో తెలుస్తుంది. నాకు తెలిసీ 'అత్తారింటికి దారేది', 'ఎవడు' చిత్రాలు రెండూ పెద్ద హిట్టయ్యే సినిమాలే' అని వ్యాఖ్యానించారు.

'సినిమా కోసం రెండేళ్లు ఎంతో కష్టపడ్డాం. కథ విన్నప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యానో...సినిమా పూర్తయిన తర్వాత ప్రివ్యూచూసిన తర్వాత కూడా అంతే ఉద్వేగానికి గురయ్యాను. ప్రేక్షకులను సినిమా కనెక్టయితే తప్పకుండా పెద్ద హిట్టవుతుంది. పవన్ కళ్యాణ్, చరణ్ మాట్లాడుకునే 'ఎవడు' సినిమాకు ఆగస్టు 21' డేట్ పిక్స్ చేసారు' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. జయసుధ, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్బీ శ్రీరామ్‌, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సహ నిర్మాతలు: శిరీష్‌ - లక్ష్మణ్‌, నిర్మాత : దిల్ రాజు, దర్శకత్వం : వంశీ పైడిపల్లి.

English summary

 Mega Power Star Ram Charan’s ‘Yevadu’ has been shifted to August 21st. The movie was originally scheduled for a release on July 31st. Yevadu which is already facing few troubles with theaters issue with Attarintiki Daredi is now stepping back.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu