For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Masooda ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకొన్నా.. శభాష్! హ్యాట్రిక్ హిట్టు కొట్టావు.. నిర్మాత రాహుల్‌కు దిల్ రాజ్ ప్రశంస

  |

  మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో సాయికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మసూద. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం నవంబర్ 18వ తేదీన రిలీజైంది.హారర్, డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌వీపీ బ్యానర్ ద్వారా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్రయూనిట్‌తో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు అడిగిన ప్రశ్నలకు రాహుల్ యాదవ్ నక్క సమాధానం చెబుతూ..

   మసూద నిడివి తగ్గించమని దిల్ రాజు

  మసూద నిడివి తగ్గించమని దిల్ రాజు

  మసూద నిడివి తగ్గించమని దిల్ రాజు అడిగారు. అయితే సినిమా విషయంలో నిజాయితీగా ఉండాలని అనుకొన్నాను. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా చేయాలంటే.. చాలా స్క్రిప్టులు ఉన్నాయి. మసూద స్క్రిప్టు విన్న తర్వాత కథకు సంబంధించిన ఆత్మ మిస్ కాకుండని అనుకొన్నాను. స్క్రిప్టులో ఉండే బలమైన అంశాలను చూసే నేను ధైర్యంగా ఉన్నాను. సినిమా లెంగ్త్ గురించి ఆలోచించలేదు. సినిమా కమర్షియల్‌గా ఆలోచించకుండా డిఫరెంట్‌గా ఉండాలనే విషయంతోనే నిజాయితీగా, ధైర్యంగా ముందుకెళ్లాను అని నిర్మాత రాహుల్ నక్క అన్నారు.

   అమ్మినా.. అమ్మకపోయినా నష్టం లేదు అంటూ

  అమ్మినా.. అమ్మకపోయినా నష్టం లేదు అంటూ


  మసూద సినిమాకు ముందు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముకోమని దిల్ రాజు చెప్పారు. కానీ నేను ఓటీటీ, శాటిలైట్ హక్కులను అమ్మకుండా నా వద్దే పెట్టుకొన్నాను. సినిమా రిలీజ్‌కు ముందు ఓటీటీ, శాటిలైట్ హక్కుల విషయంలో కొన్ని ఆఫర్స్ వచ్చాయి. ఆ ఆఫర్లు విన్న తర్వాత ఆ రేటుకు అమ్మినా.. అమ్మకపోయినా నష్టం లేదనే అభిప్రాయం కలిగింది అని రాహుల్ యాదవ్ నక్క అన్నారు.

  దిల్ రాజు అలా సపోర్ట్

  దిల్ రాజు అలా సపోర్ట్


  మళ్లీ రావా; ఏజెంట్ సాయి శ్రీనివాస సినిమాల తర్వాత ఓసారి నిర్మాతల మండలి సమావేశంలో దిల్ రాజు కలిసి ఓ ఆఫర్ ఇచ్చారు. రాహుల్.. నీకు ఇష్టమైన సినిమా తీసుకో.. నా బ్యానర్‌ బ్రాండ్ ఉపయోగించుకొని సినిమా రిలీజ్ చేసుకోమని చెప్పారు. దిల్ రాజులో నాకు బాగా నచ్చింది అదే. ఒక పెద్ద నిర్మాతకు నాలాంటి నిర్మాతకు సపోర్టు చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు భేషరతుగా సపోర్ట్ ఇచ్చారు. అందుకు దిల్ రాజుకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను అని రాహుల్ అన్నారు.

   దిల్ రాజుకు సినిమా చూపిస్తే..

  దిల్ రాజుకు సినిమా చూపిస్తే..


  మసూద సినిమా రిలీజ్‌కు ముందు దిల్ రాజుకు సినిమా పోస్టర్ చూపించాను. ఆ తర్వాత చాలా మందికి సినిమా చూపిస్తే.. లెంగ్త్ ఎక్కువైందని చెప్పారు. దిల్ రాజు నిడివి తగ్గించమని చాలా సార్లు చెప్పారు. కానీ 2.40 గంటల నిడివితోనే సినిమాను రిలీజ్ చేయాలని అనుకొన్నాను. కానీ స్క్రిప్టులో ఉన్న హారర్ సన్నివేశాలే నా కాన్ఫిడెన్స్. నేను చాలా మందికి సినిమా చూపించినప్పుడు డీఐ, సౌండ్ డిజైన్, ఇతర అంశాలు పూర్తి కాలేదు. అవన్నీ ఆయిన తర్వాత థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ బాగుంటుందని అనుకొన్నా. నా నమ్మకమే నిజమైంది అని రాహుల్ యాదవ్ నక్క అన్నారు.

   రాహుల్ యాదవ్ కాన్ఫిడెన్స్ సూపర్

  రాహుల్ యాదవ్ కాన్ఫిడెన్స్ సూపర్


  దిల్ రాజు మాట్లాడుతూ.. ఎంత చెప్పినా నిడివి తగ్గించకపోవడంతో.. రాహుల్ యాదవ్ నక్కా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడని అనుకొన్నాను. సినిమా మార్నింగ్ షో పూర్తయిన తర్వాత రివ్యూలు 3 రేటింగ్ వేశారు. అయితే కలెక్షన్లు మాత్రం 25 శాతం అక్యుపెన్సీ కనిపించింది. ఫస్ట్, సెకండ్ షోలకు పికప్ అవుతుందని అనుకొన్నాను. నేను అనుకొన్నట్గుగానే.. వైజాగ్, ఇతర ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. ఈ సినిమాను ఆదరించిన మీడియా వాళ్లకు థ్యాంక్స్. మంచి సినిమాను బతికించాలి. సినిమా బాగా లేకపోతే ఎవరూ ఏం చేయలేరు.. కాబట్టి మసూదకు సపోర్ట్ చేద్దాం. థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ బాగుంటుంది అని అన్నారు.

  English summary
  'Masooda' was released on November 18. For Swadharm Entertainment, this is the third hit in a row. 'Malli Raava' and 'Agent Sai Srinivas Athreya' were hit movies for producer Rahul Yadav Nakka. On Monday, the film's core team interacted with the media. Producer Dil Raju, who backed 'Masooda' on Sri Venkateswara Creations, shared his insights on the occasion.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X