»   » అనుష్క కోసమే దిల్ రాజు అంత మొత్తం ఖర్చు చేసాడా?

అనుష్క కోసమే దిల్ రాజు అంత మొత్తం ఖర్చు చేసాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క టైటిల్ రోల్ చేస్తున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ 'రుద్రమదేవి' చిత్రం నైజాం, వైజాగ్ రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. అనుష్క సినిమాలకు మంచి డిమాండ్ ఉండటం, అల్లు అర్జున్ గెస్ట్ రోల్(గోన గన్నారెడ్డి పాత్ర) చేస్తుండటం లాంటి ప్లస్ పాయింట్స్ ఉండటంతో దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Dil Raju buys 'Rudramadevi' Nizam & Vizag rights

అనుష్క మెయిన్ రోల్‌లో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క, రానా, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, సుమన్, ఆదిత్య మీనన్, నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, బాబా సెహగల్, జయప్రకాష్ రెడ్డి, అజయ్, అర్పిత్ రాంకా, వేణు మాధవ్, వెన్నెల కిషోర్, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, కృష్ణ భగవాన్, ప్రభ, అదితి చెంగప్ప, సంధ్యా జనక్, అనితానాథ్, సుబ్బరాయశర్మ, సంపత్ రాజ్, జీవా, రవిప్రకాష్, వినోద్, ప్రసన్నకుమార్, టీవీ 9 హర్ష, ఈ టీవీ ప్రభాకర్, పార్థసారథి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: తోటతరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజైనర్ : నీతా లుల్లా, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటల: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయిబాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామగోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.

English summary
The most awaited period film in Tollywood right now is, ‘Rudramadevi’. This movie will be India’s first Stereoscopic 3D film. Dil Raju buys 'Rudramadevi' Nizam & Vizag rights
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu