»   »  డబ్బులు హీరోయిన్ల బట్టలిప్పించటానికి కాదు... దిల్ రాజు చెప్పిన మాటలే ఇవి

డబ్బులు హీరోయిన్ల బట్టలిప్పించటానికి కాదు... దిల్ రాజు చెప్పిన మాటలే ఇవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ సినిమా హిట్ కావాలంటే స్టార్ హీరో, హీరోయిన్ ఉండాలి.హీరోలతో పాటుగా హీరోయిన్లు కూడా కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు. హీరో అంటే సినిమాను ఒంటి చేత్తో నడిపిస్తాడు. ఫైట్లూ ఎక్కవగా, బాగ చేస్తాడు కాబట్టి డిమాండ్ ఎక్కువ.కోట్లు ఇస్తాం..మరి హీరోయిన్ కు ఎందుకు కోట్లు ఇస్తున్నారు.. హీరోయిన్ లు కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు. అందుకని వాళ్లు ఒంటి నిండా బట్టలు వేసుకోవడానికి వీలు లేదు.

కోట్ల కొద్దీ పారితోషికం తీసుకుంటున్నది అలా నటించడానికేగా?... కింది క్లాస్‌ ఆడియన్స్‌ని కథానాయికలు చిట్టి పొట్టి బట్టలు వేసుకుని, ఆనందపరచాలి.. ఒకవేళ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కనక కథానాయికలు వేసుకోవాల్సిన డ్రెస్సులను మోకాళ్లు కవర్‌ చేసేలా డిజైన్‌ చేస్తే... పొడవు తగ్గించమని నిర్మొహమాటంగా చెబుతా.. హీరోయిన్‌కి అసౌకర్యంగా అనిపించినా నాకేమీ సంబంధం లేదు. ఆ డ్రెస్‌ వేసుకోవాల్సిందేనని చెప్పేస్తా... అంటూ తమిళ దర్షకుడు సురాజ్ చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి.

ఆ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన వెంతనే పెద్ద కలకలమే రేగింది. డైరెక్టర్ సురాజ్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, ఈ అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు సురాజ్ తనకు, పరిశ్రమలోని అందరు ఆడవాళ్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆమెకు మద్దతుగా స్టార్ హీరోయిన్ నయనతార "''మేము అందరం స్ట్రిప్పర్స్ అనుకున్నారా? వెండితెర మీద బట్టలు చిన్నగా వేసుకుని అలరించడానికి మేం కీలుబొమ్మలం కాదు. ఇలా అమ్మాయిలను ఆబ్జెక్టిఫై చేయడం మానుకోండి'' అంటూ లెఫ్ట్ అండ్ అరైట్ ఇచ్చేసింది. నటుడు, బాహుబలితో నేషనల్ లెవల్ కు ఎదిగిన రానా, విశాల్ లతో సహా అంతా చీవాట్లు పెట్టేసరికి సురాజ్ అందరికీ లేఖ ద్వారా క్షమాపణలు తెలిపాడు.

Dil Raju Counter To Director Suraj Comments


అయితే ఇదే విషయం మళ్ళీ తెరమీదకు వచ్చింది తాజాగా టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ఒక టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు 'హీరోయిన్లకి డబ్బులిచ్చేది వాళ్లతో యాక్ట్‌ చేయించుకోవడానికి. బట్టలిప్పడానికి కాదు'' అంటూ ఘాటుగా స్పందించారు. ''ఈ విధమైన ఆలోచన తప్పు. సీన్‌ అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని రకాల బట్టలు వేసుకోవాల్సి వస్తుంది కానీ డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి అలాగే కనిపించాలి అనడం కరక్ట్‌ కాదు'' అంటూ సురాజ్‌ ఆలోచనా తీరుని తప్పుబట్టాడు.

అంతే కాదు ''నేను తీసే ప్రతి సినిమానీ చూసుకుంటూ వుంటాను. అంతా అనుకున్నట్టే జరుగుతుంటే ఏమీ చెప్పను. ఒకవేళ దర్శకుడు చెప్పింది కాక మరొకటి తీస్తుంటే మాత్రం క్వశ్చన్‌ చేస్తాను. ఆమధ్య ఒక సినిమాకి 35 రోజులు షూటింగ్‌ జరిగిన తర్వాత అదంతా పక్కన పెట్టి మళ్లీ షూటింగ్‌ చేయించాను. అలాగే తీస్తే ఆ సినిమా వర్కవుట్‌ అవదని నాకు తెలుసు. అక్కడ నేను ఆ నిర్ణయం తీసుకోకపోతే ఆ సినిమా ఫెయిలయ్యేది'' అంటూ చెప్పాడు.

English summary
Star Producer Dil Raju angry on Suraj comments against heroines exposing. And also clear airs his involvement in his Movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu