Just In
- 42 min ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 1 hr ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 2 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- News
షర్మిల కొత్త పార్టీ:చర్చ్ స్ట్రాటజీ: పోప్ జాన్‌పాల్-2 ప్రసంగంతో లింక్: రెడ్లందరినీ: సీబీఐ మాజీ డైరెక్టర్
- Finance
యస్ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 20 శాతానికి చేరుకోవచ్చు
- Sports
టెస్ట్‌ల్లో ఆ అవకాశమిస్తే అదృష్టంగా భావిస్తా: వాషింగ్టన్ సుందర్
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Lifestyle
ఇంట్లో మీ రక్తపోటును తనిఖీ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 7 విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చాలా డిస్ట్రబ్ అయ్యా, జీవితంలో మళ్లీ ‘ఫ్యామిలీ’ జోలికి వద్దనుకున్నా: దిల్ రాజు
నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి టాకే వస్తున్నప్పటికీ యూత్ నుండి నెగెటివ్ టాక్ వచ్చింది. తమ సినిమా అన్ని వర్గాలకు నచ్చుతుందని భావించిన దిల్ రాజు అండ్ టీమ్ ఈ పరిణామాలతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. సినిమా రిలీజైన రోజు వచ్చిన రిపోర్ట్ చూసి తాను ఎంతగా బాధ పడ్డానో దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.


చాలా డిస్ర్టబ్ అయ్యాను
ఇకపై ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల మీద బేస్ అయిపోదామనుకుంటున్నారా? అనే ప్రశ్నకు దిల్ రాజు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గోవా వెళ్లేందుకు ప్లైట్ ఎక్కాను. శ్రీనివాస కళ్యాణం సినిమా విషయంలో తొలి రోజు వచ్చిన కొన్ని కామెంట్స్ చూసి చాలా డిస్ట్రబ్ అయ్యాను... అని దిల్ రాజు తెలిపారు.

ఫ్యామిలీ జోలికి వెళ్లొద్దు అనిపించింది
మళ్లీ లైఫ్‌లో ఫ్యామిలీ జోలికి వెళ్లొద్దు అనే నెగెటివ్ వైబ్రేషన్ వచ్చింది. గతేడాది ఆరు సినిమాలు చేశాం. శతమానం భవతి ఒక్కటే ఫ్యామిలీ మూవీ. వేరే సినిమాలన్నీ కమర్షియల్, లవ్ మూవీస్. అన్నీ ఆడాయి కదా, ఈ ఫ్యామిలీ సినిమాల గోల నాకు ఎందుకు? వదిలేద్దామా? అనే ఒక నెగెటివ్ వైబ్రేషన్ వచ్చింది.... అని దిల్ రాజు తెలిపారు.

మూడు రోజులుగా ఎంజాయ్ చేస్తున్నాను
రిలీజ్ రోజు టాక్‌తో అలా అనిపించినా... లాస్ట్ మూడు రోజుల నుండి బాగా ఎంజాయ్ చేస్తున్నది మళ్లీ ఈ సినిమా ద్వారానే. ఫ్యామిలీ ప్రేక్షకలు బాగా ఆదరిస్తున్నారు. మేము తీసే సినిమా మంచి సినిమా ఆయుండి, ప్రేక్షకుల నుండి అభినందనలు వస్తున్నపుడే మేము మరిన్ని మంచి సినిమాలు చేసే దిశగా ముందుకు నడవగలమని దిల్ రాజు తెలిపారు.

ఇలాంటి సినిమా వచ్చే అవకాశం లేదా?
దిల్ రాజు వ్యాఖ్యలు చూస్తుంటే.... శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ నుండి మళ్లీ ఇప్పట్లో ఇలాంటి సినిమా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇకపై ఆయన కేవలం ఫ్యామిలీ సినిమా అని కాకుండా కమర్షియల్, లవ్ ఎలిమెంట్స్ కూడా తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట.