»   » దిల్ రాజు గ్యాంబ్లింగ్.. గట్టిగా అనుకొన్నాడు.. తేడా కొడితే పరిస్థితి ఏంటీ?

దిల్ రాజు గ్యాంబ్లింగ్.. గట్టిగా అనుకొన్నాడు.. తేడా కొడితే పరిస్థితి ఏంటీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో నిర్మాతగా, పంపిణీ దారుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పేరు దిల్ రాజు. చిత్ర రంగంలో ఆయనది లక్కీ హ్యాండ్ అని అందరూ అంటుంటారు. అది 100 శాతం వాస్తవం. ఆయన ఓ చిత్రం పంపిణీ హక్కులు తీసుకున్నారంటే... ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురుపించాల్సిందే. భారీ బడ్జెట్ చిత్రాలతో ఆడుకోవడం దిల్ రాజుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం దిల్ రాజు చేతిలో మూడు స్టార్ హీరోలకు సంబంధించిన భారీ బడ్జెట్ చిత్రాలు స్పైడర్, జై లవకుశ, పవన్ చిత్రం చేతిలో ఉన్నాయి. ఆయన సక్సెస్ అవుతాయని గట్టిగా అనుకొని సాహసం చేసినట్టు కనిపిస్తున్నది. ఒకవేళ తేడా కొడితే పరిస్థితి ఏమిటనే మాట వినిపిస్తున్నది.

29 కోట్లతో పీఎస్ పీకే 25..

29 కోట్లతో పీఎస్ పీకే 25..

తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, కీర్తి సురేష్ నటిస్తున్న పీఎస్ పీకే 25 చిత్రాన్ని రూ. 29 కోట్లతో నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంపై అటు చిత్ర పరిశ్రమ వర్గాల్లో... ఇటు పవన్ అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. గతంలో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

సంక్రాంతికి పవన్ చిత్రం..

సంక్రాంతికి పవన్ చిత్రం..

అంతకు మించి పీఎస్ పీకే 25 చిత్రం ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పవన్, త్రివిక్రమ్ ద్వయంతో ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో సాగుతున్న సంగతి తెలిసిందే. పీఎస్ పీకే 25 వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను ముందుకు రానుంది.

మహేష్, ఎన్టీఆర్ చిత్రాలు సైతం...

మహేష్, ఎన్టీఆర్ చిత్రాలు సైతం...

అయితే ఇప్పటికే దిల్ రాజు... ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జై లవకుశ రూ. 20 కోట్లు చెల్లించి పంపిణీ హక్కులను సొంతం చేసుకొన్నట్టు సమాచారం. దాంతోపాటు మహేష్ బాబు నటించిన స్పైడర్ రూ.21 కోట్లు వెచ్చించి నైజాం హక్కులను సొంతం చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాల్లో వినికిడి.

దిల్ రాజు లక్కీ హ్యాండ్...

దిల్ రాజు లక్కీ హ్యాండ్...

అలాగే శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన శతమానం భవతి చిత్రం నైజాం హక్కులు కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన నేను లోకల్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు సునామీ సృష్టించింది.

ఫిదాతో లాభాల పంట..

ఫిదాతో లాభాల పంట..

అలాగే విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి, వరుణ్ తేజ జంటగా వచ్చిన చిత్రం ఫిదా గురించి చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ చిత్రం నైజాం హక్కులు కూడా దిల్ రాజు సొంత చేసుకున్నారు. దిల్ రాజు హ్యాండ్ లక్కీ హ్యాండ్ అనే చెప్పాడానికి ఇంతకీ మించి ఉదాహారణ ఉండదు కదా.

English summary
After bagging the Nizam rights of Jr NTR, Nivetha Thomas and Raashi Khanna starrer 'Jai Lava Kusa' and Mahesh Babu and Rakul Preet starrer 'Spyder', his latest acquisition is Pawan Kalyan and Keerthy Suresh's yet to be named 'PSPK 25'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu