»   » ఆ ఇంటిని కూల్చేస్తున్నారు: బాలీవుడ్ స్టార్ ఇంటిని కూల్చేస్తున్న పాకిస్థాన్

ఆ ఇంటిని కూల్చేస్తున్నారు: బాలీవుడ్ స్టార్ ఇంటిని కూల్చేస్తున్న పాకిస్థాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశ విభజన సమయం లో వలసలు చాలానే జరిగాయి. దేశాన్ని ముక్కలుగా విడదీస్తున్నప్పుడు మేము భారత్ లోనే ఉంటామంటూ వచ్చిన వాళ్ళు కొందరైతే, పాక్ వైపు వెళ్ళిన వాళ్ళు కొందరు అలా అక్కడ ఉన్న ఆస్థులని వదిలేసి వచ్చి ఇక్కడ స్థిరపడ్డలుటుంబాల్లో చాలామందే దేశం లోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు.. బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ ఇల్లు కూడా పాకిస్థాన్ లో ఉంది, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇల్లు భారత భూబాగం లోని పంజాబ్ లో ఉంది... ఇప్పుడిదంతా ఎందుకూ అంటే... బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ ఇల్లున్ కూడా పాక్ లోనే ఉంది. ఆ ఇంటివిషయం లో పాక్ ప్రభుత్వ నిర్ణయమే ఇప్పుడు దిలీప్ అభిమానులకు మింగుడు పడటం లేదు ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే....

దిలీప్ కుమార్ పూర్వీకుల ఇల్లు

దిలీప్ కుమార్ పూర్వీకుల ఇల్లు

పాకిస్తాన్ లో ఉన్న దిలీప్ కుమార్ పూర్వీకుల ఇంటిని ఇప్పుడు అక్కడ ప్రభుత్వం పడగొట్టి గ్రంధాలయం గాని మ్యూజియం గాని కట్టే ప్రయత్నాలు చేస్తోందట. ఆల్రెడీ పడగొట్టడం స్టార్ట్ చేశారు కూడా. ఇదే విషయం పై దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను తన ఆశాభావాన్ని వ్యక్త పరిచారు.

బాల్యం అక్కడే గడిచింది

బాల్యం అక్కడే గడిచింది

"అతని బాల్యం అక్కడే గడిచింది అందువలన ఆ ఇంటితో చాలా అనుభంధం ఉందిని చెప్పారు. చాలా ఏళ్ళు కిందట అక్కడకు వెళ్ళాం అప్పటికే ఆ ఇల్లు పూర్తిగా శిథాలవస్తలో ఉంది. అక్కడ కొంత మంది ఫాన్స్ దాన్ని కాపాడుతూ వచ్చారు. దిలీప్ కుమార్ ప్రతి పుట్టిన రోజు పెషావర్ లో ఉన్న ఫాన్స్ ఘనంగా జరిపేవాళ్లు.

చాలా ప్రమాణాలు చేశారు

చాలా ప్రమాణాలు చేశారు

వాళ్ళు నుండి వచ్చే సందేశాలు అప్పుడుప్పుడు అక్కడ పరిస్థితి తెలిసేది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిసింది. ఇంతకు ముందు ఆ ఇంటిని వారసత్వ సంపదగా గుర్తించి దాన్ని కాపాడతామని చాలా ప్రమాణాలు చేశారు కానీ ఏది అమలుకాలేదు'' అంటూ చెప్పింది.

అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్.

అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్.

నిజానికి గతం లో పాకిస్థాన్ ప్రభుత్వం ఆయన మీద బాగానే ప్రేమను కురిపించింది. పెషావర్ లో ఉన్న దిలీప్ కుమార్ ఇంటిని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించింది. దిలీప్ కుమార్ దేశవిభజనకు పూర్వం పెషావర్ లో జన్మించారు. పష్తూన్ తెగకు చెందిన ఆయన అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్.

దిలీప్ కుమార్ గా మార్చుకున్నారు

దిలీప్ కుమార్ గా మార్చుకున్నారు

భారత్ కు వలస వచ్చిన అనంతరం సినిమా రంగంలో ప్రవేశించి పేరును దిలీప్ కుమార్ గా మార్చుకున్నారు. నటనారంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా పాకిస్థాన్ 1998లో 'నిషాన్-ఏ-ఇంతియాజ్' అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారం పాక్ లో అత్యున్నతమైనది.

షారుక్ పూర్వీకుల ఇల్లు కూడా

షారుక్ పూర్వీకుల ఇల్లు కూడా

పాకిస్తాన్ గవర్నమెంట్ దిలీప్ సాబ్ ఇంటిని కూల్చెయ్యకుండా ఉంటుందనే చేస్తుంది అని ఆశాభావం తో ఉన్నారు సైరా బాను. దిలీప్ కుమార్ ఇల్లు మాత్రమే కాదు చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఇల్లులు ఇంకా అక్కడ మిగిలే ఉన్నాయి. బాలీవుడ్ నిన్నటి తరం స్టార్ హీరో స్వర్గీయ వినోద్ ఖన్నా ఇల్లు కింగ్ ఖాన్ షారుక్ పూర్వీకుల ఇల్లు కూడా పెషావర్ సిటీ లో ఉంది.

English summary
Dilip Kumar’s 100-year-old house in Peshawar, Pakistan has collapsed but authorities have said a replica would soon come up at the site.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu