twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గృహహింస'కేసుపై కోర్టుకి అక్షయ్‌కుమార్‌

    By Srikanya
    |

    ముంబయి: తమ కుటుంబంపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ బాలీవుడ్‌ దివంగత సూపర్‌స్టార్‌ రాజేష్‌ఖన్నా భార్య, నటి డింపుల్‌ కపాడియా, ఆమె అల్లుడు అక్షయ్ కుమార్..బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాజేష్‌ ఖన్నా తనతో సహజీవనం సాగించినట్లు చెప్పుకొంటున్న అనితా అద్వానీ డింపుల్‌పై కేసు పెట్టారు. ఖన్నా మరణించిన తర్వాత బాంద్రాలోని ఆశీర్వాద్‌ బంగ్లా నుంచి తనను డింపుల్‌ తరిమివేసినట్లు ఆమె ఆరోపించారు. ఖన్నా ఎస్టేట్‌ నుంచి నెలకు రూ.10 లక్షలచొప్పున భరణం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. డింపుల్‌ కపాడియా, ఆమె కుటుంబీకులపై ఈ మేరకు అనితా అద్వానీ గృహహింస కేసుపెట్టారు.

    దీనిపై బాంబే హైకోర్టులో కపాడియా పిటిషన్‌ దాఖలు చేస్తూ తాను చట్టపరంగా ఖన్నాను వివాహం చేసుకున్న భార్యనని.. తన భర్త వదలిపెట్టి వెళ్లిన ఆస్తిలో ఏ మహిళా వాటా కావాలని కోరజాలదని వాదించారు. అదీగాకుండా అనితా అద్వానీ ఫిర్యాదు మేరకు బాంద్రా మేజిస్ట్రేట్‌ తనకు, తన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయడాన్ని పిటిషన్‌లో సవాల్‌ చేశారు. రాజేష్‌ ఖన్నాకు చెందిన సుమారు రూ.500 కోట్ల విలువైన ఆస్తిలో వాటా అడిగే హక్కు అనితా అద్వానీకి లేదని కపాడియా వాదనను బలపరుస్తూ ఆమె అల్లుడు, నటుడు అక్షయ్‌కుమార్‌ కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారం హైకోర్టులో తేలేవరకు బాంద్రా మేజిస్ట్రేట్‌ ఎదుట విచారణ నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈకేసుపై జస్టిస్‌ కె.యు.చాందివల్‌ సోమవారం విచారణ జరపనున్నారు.

    రాజేష్ ఖన్నా మరణం తర్వాత.....రాజేష్ ఖన్నా ఫ్యామిలికీ, రాజేష్ ఖన్నా ప్రియురాలి(డేటింగ్ పార్టనర్) అనితా అద్వానీ మధ్య ప్రాపర్టీ గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా, అల్లుడు అక్షయ్ కుమార్, కుతుర్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నాలపై గృహ హింస చట్టం కింద కేసు వేసింది. బాంద్రాలోని రాజేష్ ఖన్నాకు చెందిన బంగ్లా 'ఆశీర్వాద్' విషయంలోనే ఈ రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది.దాదాపు 8 ఏళ్లుగా రాజేష్ ఖన్నాతో అనితా అద్వానీ ఆశీర్వాద్ బంగ్లాలో సహజీవనం చేస్తోంది. రాజేష్ ఖన్నా మరణం అనంతరం అనితా అద్వానీని బయటకు పంపి ఆ బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి ఖన్నా ఫ్యామిలీ ప్రయత్నిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

    తాను పిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడి కుటుంబానికి చెందినదాన్నని, బాలీవుడ్‌లో నిర్మాతగా అడుగు పెట్టడానికి ప్రయత్నించానని అద్వానీ గతంలో చెప్పారు. తనకు ఇప్పుడు 50 ఏళ్లని, తనకు మరొకరి సహాయం అవసరమైన సమయంలో తనను ఇంటి నుంచి బయటకు పంపించేశారని ఆమె ఆరోపించారు.బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఇంటి నుంచి తనను బయటకు గెంటేశారని ఆరోపిస్తూ అనితా అద్వానీ గృహ హింస నిరోధక చట్టం కింద తన హక్కును డిమాండ్ చేశారు. రాజేష్ ఖన్నా అంత్యక్రియల సందర్భంగా కుటుంబ సభ్యుల తీరు తనను ఇబ్బంది పెట్టేలా ఉందని ఆమె ఆరోపించారు.

    English summary
    Rajesh Khanna's actress wife Dimple Kapadia has moved the Bombay High Court for quashing a case of domestic violence filed against her and family by a woman claiming to have been in a live-in relationship with the late superstar. Along with Kapadia, Akshay Kumar too has filed a petition in the High Court supporting her contention that Advani had no right to claim any share from Khanna's properties which is said to be to the tune of Rs 500 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X