twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాల్తేరు వీరయ్య విషయంలో కొరటాల శివ సలహ నిజమే.. ఆయన ఏమన్నారంటే: బాబీ

    |

    మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని మొత్తం వెనక్కి తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం సినిమా ప్రాఫిట్స్ లో కొనసాగుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుని చిరంజీవి కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలో మాస్ కమర్షియల్ అంశాలతోపాటు రవితేజ పాత్ర కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

    దర్శకుడు బాబి ఫ్యాన్స్ ఎలాగైతే చిరంజీవిని చూడాలని అనుకుంటున్నారో ఆ విధంగానే మెగాస్టార్ గ్రా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఎక్కువ స్థాయిలో బాబీకి మంచి గుర్తింపు లభిస్తోంది. అయితే ఈ సినిమా కథలో రవితేజను తీసుకోవడానికి ముందు అతను కొంతమంది సినీ ప్రముఖులతో కూడా చర్చలు జరిపాడట. ముఖ్యంగా తన అసిస్టెంట్స్ కంటే అలాగే మిగతా వారికంటే ముందుగా రవితేజను తీసుకోవాలా వద్దా అని కొరటాల శివ ను అడిగినట్లుగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

    Director bobby about koratala siva suggestions in Waltair Veerayya

    అయితే కథ ప్రకారం అయితే అతను కరెక్ట్ గా సెట్ అవుతాడు అని కొరటాల శివ కూడా బాబీకి సపోర్టుగా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా బాగా అనిపించింది అని కొరటాల శివ గారు తనకు చాలా బాగా సన్నిహితులు అని కూడా ఈ దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇక బాబి మెగాస్టార్ చిరంజీవిలోని కామెడీ టైమింగ్ తో పాటు ఆక్షన్ ఎలివేషన్స్ అలాగే ఎమోషన్ కూడా బాగా హైలెట్ చేయగలిగాడు.

    అదే విషయంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు అతనిని పొగుడుతున్నారు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవితోనే మరొక సినిమా కూడా చేయాలి అని ఫ్యాన్స్ నుంచి అతనికి ఫుల్ సపోర్ట్ అయితే వస్తోంది. ఇక ప్రస్తుతం బాబి అయితే వాల్తేరు వీరయ్య సినిమా సాధించిన విజయాన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే అతను తదుపరి సినిమా ఎవరితో అనే విషయాన్ని ఫైనల్ చేయలేదు కానీ మళ్ళీ రవితేజ తోనే ఒక యాక్షన్ మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Director bobby about koratala siva suggestions in Waltair Veerayya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X