»   » 'పవన్ ఇంటిముందు ధర్నా చేస్తాను' అంటున్నాడు

'పవన్ ఇంటిముందు ధర్నా చేస్తాను' అంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సినిమాల నుంచి తప్పుకుంటాననే మాట పవన్ నోటి నుంచి వినాలంటే భయంగా వుంది. అందుకే పవన్‌కల్యాణ్ ముందు ఆ ప్రస్తావనను ఎప్పుడూ తీసుకురాలేదు. పవన్‌కల్యాణ్ సినిమాల నుంచి తప్పుకున్న రోజు ఆయన ఇంటిముందు ధర్నా చేసే మొదటి వ్యక్తిని నేను. ఆయన్ని సినిమాల నుంచి దూరం కానివ్వను అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు దర్శకుడు బాబి.

గత కొద్ది రోజులుగా పవన్ ..సినిమాలనుంచి తప్పుకుంటారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై అభిమానుల మధ్య ఓ రేంజిలో చర్చ జరుగుతోంది. ఇదే విషయమై బాబి సైతం ఇలా ఎమోషన్ గా మాట్లాడారు.

Director Bobby about Pawan's Retirement

పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్. బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి శరత్‌మరార్, సునీల్ లుల్లా నిర్మాతలు. ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా బాబి మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.

బాబి మాట్లాడుతూ...గబ్బర్‌సింగ్ టైటిల్‌తో వస్తోన్న సినిమా కావడంతో కథ వినేముందు సినిమాకు న్యాయం చేయగలనో?లేదో? అని చాలా భయపడ్డాను. కానీ పవన్‌కల్యాణ్ చెప్పిన కథ నన్ను బాగా ఆకట్టుకుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన మంచి సినిమా అవుతుందనిపించింది.

Director Bobby about Pawan's Retirement

కథను ఆకళింపు చేసుకొని దానిపై పూర్తి పట్టు సాధించడానికి ఐదు నెలలు పట్టింది. ఆ సమయంలో ప్రతిరోజు పవన్‌కల్యాణ్‌తో కలిసి ప్రయాణించాను. సినిమాకు సంబంధించి నాలో ఉన్న ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాను. హీరో కంటే ముందు పవన్‌కల్యాణ్ నాకు రచయితగా పరిచయం కావడం సంతోషంగా అనిపించింది అన్నారు.

English summary
Director Bobby said that he is very much happy work with Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu