నిక్కర్ వేసుకొమ్మన్నారని గంగోత్రి సినిమా రిజెక్ట్.. పరువు కొసం అవకాశాన్ని వదులుకున్న బడా దర్శకుడు!

అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు 100వ సినిమా కావడంతో అప్పట్లో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. కీరవాణి మ్యూజిక్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇక ఇటీవల బలుపు, జై లవకుశ, వెంకీమామ దర్శకుడు కెఎస్.రవీంద్ర (బాబీ) పరువు కోసం ఆ సినిమాలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడట.

అల్లు అర్జున్ - అదితి అగర్వాల్

అల్లు అర్జున్ - అదితి అగర్వాల్

2003లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన గంగోత్రి సినిమా ద్వారా అల్లు అర్జున్ - అదితి అగర్వాల్ ఇండస్ట్రీలోకి హీరో హీరోయిన్స్ గా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక సినిమాకు చిన్నికృష్ణ కథను అందించిన విషయం తెలిసిందే.

 రైటర్ ద్వారా

రైటర్ ద్వారా


ఇక ఈ సినిమాలో దర్శకుడు బాబీకి ఆఫర్ వచ్చిందట. బాబీ గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రైటర్ చిన్ని కృష్ణ ప్రత్యేకంగా అతన్ని కలుసుకున్నాడు. ఇంద్ర సినిమా రిలీజ్ టైమ్ లోనే. ఇక బాబీని హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ రైటర్ కలవమని చెప్పాడట.

కె.రాఘవేంద్రరావు దగ్గరకు తీసుకు వెళ్లడంతో

కె.రాఘవేంద్రరావు దగ్గరకు తీసుకు వెళ్లడంతో


అప్పటివరకు సినిమాల్లోకి రావాలని బాబీకి పెద్దగా ఆశ లేదట. ఇక ఆ సమయంలో చిన్నికృష్ణ గంగోత్రి సినిమాతో బిజీగా ఉండగా ఏదైనా అవకాశం ఇవ్వాలని కోరాడట. అతన్ని కె.రాఘవేంద్రరావు దగ్గరకు తీసుకు వెళ్లడంతో సరే అని వెంటనే గెటప్ మార్చాలని చెప్పారట. బాబీ నిక్కర్ వేసుకోవాలని అందుకోసం కొలతలు తీసుకోమ్మన్ని సహాయక దర్శకుడికి చెప్పారట.

Recommended Video

Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
 ఆ ఛాన్స్ వద్దని చెప్పి

ఆ ఛాన్స్ వద్దని చెప్పి


రాఘవేంద్రరావు అతన్ని సెలెక్ట్ చేసింది కేవలం హీరో పక్కన ఒక ఫ్రెండ్ పాత్ర కోసమే. ఇక నిక్కర్ వేసుకుంటే గుంటూరులో తన పరువు పోతుందని బాబీ వెంటనే ఆ ఆఫర్ వద్దని అన్నాడట. అనంతరం నటించకపోతే ఏం చేస్తావని చిన్ని కృష్ణ అడిగితే కథలు రాస్తానని చెప్పాడట. ఇక ఆ సినిమాలోనే కొన్ని సీన్స్ రాయమని టెస్ట్ చేయడంతో అద్భుతమైన సీన్స్ రాసి ఇచ్చాడట. అనంతరం పలు సినిమాలకు రైటర్ గా వర్క్ చేసి బాబీ దర్శకుడి స్థాయికి చేరుకున్నారు. నెక్స్ట్ మెగాస్టార్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X