»   » గోపీచంద్ కి 'వాంటెడ్‌' ఎవరనేదే తెలియాలంటే...

గోపీచంద్ కి 'వాంటెడ్‌' ఎవరనేదే తెలియాలంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కథలోని మలుపులు టెన్షన్ ని క్రియోట్ చేస్తాయి. 'వాంటెడ్‌' అనే పేరుకి మంచి స్పందన వస్తోంది. ఎవరు ఎవరికి కావాలో తెర మీదే చూడాలి. చక్రి అందించిన స్వరాలు ఆకట్టుకొంటాయి. ఇటీవలే ఇటలీలో మూడు పాటల్ని చిత్రీకరించాం. ఈ నెలాఖరులో పాటల్ని విడుదల చేస్తామని 'వాంటెడ్‌' చిత్ర దర్శకుడు బి.వి.ఎస్‌.రవి అన్నారు. గోపీచంద్ హీరోగా రచయిత నుండి దర్శకుడుగా మారిన బి.వి.ఎస్‌.రవి 'వాంటెడ్‌' చిత్రాన్ని రూపొందించారు. జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. అలాగే...రౌద్ర రసం పలికించడంలో గోపీచంద్ ‌ది ప్రత్యేకమైన శైలి. ఈ చిత్రంలో దాన్ని మరింత కొత్తగా ఆవిష్కరిస్తున్నాం. వినోదం, సెంటిమెంట్ ‌కీ స్థానం ఉంది. కథ, కథనాల్లో నవ్యత కనిపిస్తుంది. కథలోని మలుపులు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. దీక్షాసేథ్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అన్నె రవి, కూర్పు: శంకర్‌, ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్, నిర్మాత: వెనిగళ్ల ఆనందప్రసాద్.

ఈ చిత్రాన్ని గతంలో గోపీచంద్ తో శౌర్యం చిత్రం నిర్మించిన భవ్య క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ టైటిల్ విషయమై భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ...హీరోకి హీరోయిన్ వాండెట్. విలన్ కి హీరో వాంటెడ్. కాబట్టే స్క్రిప్టు ప్రకారం ఈ టైటిల్ యాప్ట్ అని తలిచాం అన్నారు ఇక దర్శకుడు బి.వియస్ రవి గతంలో కళ్యాణ రామ్ జయీభవ, విష్ణు వర్దన్ సలీం, ఝమ్మంది నాదం వంటి చిత్రాలకి కథ, మాటలు అందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu