»   »  "ఎస్" అంటే సమంత కాదు.., మరీ ఎక్కువ ఊహించేసాం...

"ఎస్" అంటే సమంత కాదు.., మరీ ఎక్కువ ఊహించేసాం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలయాళ 'ప్రేమమ్‌'ను తెలుగులోకి అనువదించి భారీ విజయంతోపాటు నటన పరంగా ప్రశంసలనూ అందుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ఈ విజయం అతనికి కాబోయే భార్య సమంతకు కూడా ఎంతో సంతోషాన్నిచ్చింది. అయితే ఈ సినిమాలో చైతన్య చెప్పే 'ఎస్‌' థియరీ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. "నా జాతకంలో ఎస్‌ అనే లెటర్ తో స్టార్ట్ అయ్యే నేమ్ ఉన్న అమ్మాయి నా వైఫ్ అవుతుంది అని ఉంది. ప్రేమం లో నాగ చైతన్య ఈ డైలాగ్ చెప్పగానే హాల్ విజిల్స్, అరుపులతో మారు మోగి పోయింది. ఎస్ అనే అక్షరం అనగానే "సమంతా' నే అనీ, నాగ చైతన్య రియల్ లిఫె కోసమే ఈ డైలాగ్ పెట్తారనీ ఊహించేసుకున్నారంతా...

ఎందుకంటే అది ఒరిజినల్‌లో లేదు.అయితే నాగ్, సమంతల విషయం తాను కథని రాసుకుంటున్న సమయానికి తెలియనే తెలియదనీ, రియల్ లైఫ్ ను ఉద్దేశించి పేర్లు పెట్టడం కానీ., డైలాగ్స్ రాయడం కానీ చేయలేదని చెప్పాడు దర్శకుడు చందూ మొండేటి. మామూలుగానే సెలబ్రిటీ లంటే ఉండే ఆసక్తి కంటే ఎక్కువగానే చై, సామ్ ల లవ్ స్టోరీ పాపులర్ అయ్యింది. ఇక సినిమాలో.. ఎస్ అనే అక్షరం అనగానే "సమంతా' నే అనీ ఊహించేసుకున్నారంతా...


అసలూ ఊహించలేదు :

అసలూ ఊహించలేదు :

అయితే ఈ సినిమాలో ని "ఎస్"కూ సమంతాకూ అసలే మాత్రం సంబందం లేదనీ, ఈ సినిమాలో హీరో నడిపే రెస్టారెంట్ కు "ఎస్ స్టార్" అనే పేరు అంటే.. సితార అని అర్ధం తప్ప సమంతా అనే పేరు కనీసం ఊహించను కూడా లేదంటూ వివరించాడు. గతేడాది సెప్టెంబర్ లోనే డైలాగ్స్ రాసుకున్నానని.. సమంతను ఉద్దేశించి ఎస్ సెంటిమెంట్ ను జోడించలేదంటూ డీటైల్డ్ గా చెప్పాడు.


అందుకే సుమను ప్రేమిస్తున్నా:

అందుకే సుమను ప్రేమిస్తున్నా:

చిన్నవయసులో ఉండగా చైతన్య సుమ అనే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావని స్నేహితుడు అడిగితే.. ‘చిన్నపుడు ఓ జ్యోతిష్కుడు నా చేయి చూసి ‘ఎస్‌' అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల అమ్మాయి నీ భార్య అవుతుందని చెప్పాడు. అందుకే సుమను ప్రేమిస్తున్నా' అని చెప్తాడు. ఆ తర్వాత అతని జీవితంలోకి వచ్చిన అమ్మాయి సితార పేరు కూడా ‘ఎస్‌'తోనే మొదలవుతుంది.


సెంటిమెంట్‌ కోసం:

సెంటిమెంట్‌ కోసం:

ఇక, ఆ ప్రేమ కూడా విఫలమైపోయి.. ఓ బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తాడు. దానికి కూడా ‘ఎస్‌' అని పేరు పెడతాడు. ఆ పేరు ఎందుకు పెట్టావని మూడో ప్రేయసి సింధు అడుగుతుంది. అప్పుడు చైతన్య చిన్నప్పుడు జ్యోతిష్యుడు చెప్పిందే చెబుతాడు. ఆ ‘ఎస్‌' సెంటిమెంట్‌ కోసం హీరోయిన్ల ముగ్గురి పేర్లూ ‘ఎస్‌'తో మొదలయ్యేవే పెట్టారు.


ప్రతీ వ్యక్తి జీవితంలోని ప్రేమ కథలనే:

ప్రతీ వ్యక్తి జీవితంలోని ప్రేమ కథలనే:

ప్రతీ వ్యక్తి జీవితంలోని మూడు దశల్లో కలిగే ప్రేమ కథలనే ప్రేమమ్ లో సినిమాటిక్ గా చూపించారు. 15 ఏళ్ల వయసులో పదోతరగతి చదువుతున్న విక్రమ్(నాగచైతన్య), ఆ ఊళ్లో కుర్రాళ్లంతా వెంటపడే అందమైన అమ్మాయి సుమ ను ఇష్టపడతాడు. ఆ వయసులోనే కవితలతో ప్రేమలేఖలు రాస్తాడు. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అన్నిరకాల కష్టాలు పడతాడు. అంతా ఓకె అయ్యిందనుకున్న సమయంలో విక్రమ్, సుమల ప్రేమకథ అర్థాంతరంగా ముగిసిపోతుంది. అలా ఆ బాధను మర్చి పోయే ప్రయత్నంలోనే ఐదేళ్లు గడిచిపోతాయి.


కాలేజీలో లెక్చరర్ గా :

కాలేజీలో లెక్చరర్ గా :

విక్రమ్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. ఆ వయసుల్లో ఉండే దూకుడుతో కాలేజీలో గ్యాంగ్ మెయిన్ టైన్ చేస్తూ గొడవలు, సస్పెన్ష్ లతో హీరోయిజం చూపిస్తుంటాడు. అదే సమయంలో కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిన సితార వెంకటేషన్ తో మరోసారి ప్రేమలో పడతాడు. కానీ విధి మరోసారి విక్రమ్ జీవితంతో ఆడుకుంటుంది.


ఎస్ రెస్టో పేరుతో రెస్టారెంట్:

ఎస్ రెస్టో పేరుతో రెస్టారెంట్:

విక్రమ్, సితారల ప్రేమ కథ కూడా మధ్యలోనే ముగిసిపోతుంది.అలా మరికొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. విక్రమ్ ఎస్ రెస్టో పేరుతో రెస్టారెంట్ స్టార్ చేసి లైఫ్ లో సెటిల్ అవుతాడు. కానీ సితార జ్ఞాపకాలు మాత్రం విక్రమ్ ను వెంటాడుతూనే ఉంటాయి. ఆ సమయంలో మరోసారి విక్రమ్ మనుసును ప్రేమ పలకరిస్తుంది. సింధు, విక్రమ్ జీవితంలోకి వచ్చిన మూడో ప్రియురాలు.


ప్రతీ పేరు వెనకా ఓ అర్ధం:

ప్రతీ పేరు వెనకా ఓ అర్ధం:

ప్రేమమ్ లో ప్రతీ పాత్రకు ఉన్న పేరు వెనకా ఓ అర్ధం ఉంటుందని చెప్పాడు. 'మొదట సుమ అనే అమ్మాయితో ప్రేమ. సుమ అంటే పువ్వు.. తొందరగానే ఆ ప్రేమ వాడిపోతుంది. ఆ తర్వాత సితార పాత్ర వస్తుంది. అంటే స్టార్ అని అర్ధం. ఎంత బాగున్నా నక్షత్రాలు అందవు. ఇక చివరగా సింధు. ఎప్పుడూ నుదుటనే అంటి పెట్టుకుని ఉండే సింధూరం. అలాగే హీరో పేరు విక్రమ్. అంటే పట్టువదలకుండా విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే ఆ పాత్రలకు ఆ పేర్లు పెట్టాను' అంటూ వివరించాడు చందూ.


సూప‌ర్ హిట్ టాక్ :

సూప‌ర్ హిట్ టాక్ :

రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాల‌తో ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఫ‌స్ట్ షో నుంచే సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది.చైతుకు కాబోయే భార్య, స్టార్ హీరోయిన్ సమంత అయితే మొదటి షో టాక్ రావడంతోనే పట్టరాని సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.ఇక టాలీవుడ్ సినీ జ‌నాలు, విమ‌ర్శ‌కులు సైతం ప్రేమ‌మ్ బాగుంద‌ని కితాబునిస్తున్నారు. గ‌తేడాది వ‌చ్చిన దోచేయ్ త‌ర్వాత నిరాశ‌లో ఉన్న నాగ చైతన్య ప్రేమ‌మ్ హిట్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్నారట.


English summary
"Every Name had a meaning itself in my Movie, "S" for not Samanta" Director Chanduu mondeti Clarification on Heroines Names in Premam
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu