»   » దేవకట్ట తదుపరి చిత్రం ఆడియో టీజర్ (వీడియో)

దేవకట్ట తదుపరి చిత్రం ఆడియో టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇంతకు ముందు ఆటో నగర్ సూర్య చిత్రానికి ఆడియో టీజర్ వదిలి ..క్రేజ్ తెచ్చుకుని సినిమా చేసిన దేవకట్టా మరో చిత్రానికి శ్రీకారం చుడుతూ అదే స్ట్రాటజీ ప్లే చేసారు. ఆయన తన కొత్త చిత్రం మహాప్రస్దానం కు సంభందించిన ఆడియో టీజర్ ని ట్విట్టర్ సాక్షిగా వదిలారు. ఆ టీజర్ ని ఇక్కడ వినండి.

విభిన్న చిత్రాలతో ముందుకు వెళ్లాలని మొదట నుంచి ప్రయత్నిస్తున్న దేవకట్టా మరో చిత్రం తో ముందుకు రాబోతున్నారు. ఆయన చిత్రంలో హీరోగా గోపిచంద్ నటించబోతున్నారు. ఈ విషయాన్ని దేవకట్టా స్వయంగా గతంలో తెలియచేసారు. ఇప్పుడదే ప్రాజెక్టు పట్టాలు ఎక్కబోతోందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంభందించిన పూర్తి వివరాలు బయిటకు వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందని అంటున్నారు.

Director Dev Katta's new film Mahaa Prasthanam teaser

దేవకట్టా మాట్లాడుతూ...'ఆటోనగర్‌ సూర్య' సినిమా తరవాత రెండు మూడు స్క్రిప్ట్‌లు రాసుకున్నా, ఈ సినిమాతో ఉన్న అటాచ్‌మెంట్‌ వల్ల వేరే ప్రాజెక్టులు చేయలేకపోయా. నిజానికి గోపీచంద్‌తో ఎప్పుడో సినిమా మొదలు కావాల్సి ఉంది. కానీ దానికి బయట రచయితను అనుకున్నాం. కథ ఎందుకో సరిగా కుదరలేదు. దాంతో నా సొంత కథతోనే ముందుకెళ్లాలని ఆగాం.ప్రస్థానంలో ఎలాంటి అంశాలను చూసి ప్రేక్షకులు నన్ను ఆదరించారో, ఇందులోనూ అలాంటి విషయాలనే ఇష్టపడుతున్నారు అన్నారు.

English summary
Deva Katta's Mahaa Prasthanam - a villain's conviction teaser -...Here is the teaser of Deva Katta's likely next movie Maha Prasthanam (a working title) - a villain's conviction. With “Mahaa Prasthanam” as the working title...
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu