»   » సానియా మిర్జా కోసం బాలీవుడ్ డైరెక్టర్ గ్రాండ్‌గా పార్టీ.. క్యూ కట్టిన దర్శకులు..

సానియా మిర్జా కోసం బాలీవుడ్ డైరెక్టర్ గ్రాండ్‌గా పార్టీ.. క్యూ కట్టిన దర్శకులు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కోసం ముంబైలోని తన నివాసంలో ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ భారీగా పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దర్శకులు కరణ్ జోహార్, ఫరాన్ అఖ్తర్, భర్త సాజిద్ ఖాన్, గోల్డీ బెహల్, అశుతోష్ గోవారికర్, కబీర్ ఖాన్, జోయా అఖ్తర్, పునీత్ మల్హోత్రా తదితరలు హాజరయ్యారు. ఈ పార్టీలో పలు రకాల వంటలు ఘుమఘులాడాయి. పార్టీని ఎంజాయ్ చేసిన తర్వాత సెల్ఫీలకు ఫొజులిచ్చారు.

తొమ్మిది మంది దర్శకులతో..

తొమ్మిది మంది దర్శకులతో..

సానియా పార్టీ ఫొటోలను అదే రాత్రి ఫరాఖాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తొమ్మిది మంది డైరెక్టర్లు నా ఇంటిలో జరిగిన పార్టీకి వచ్చారు. అద్బుతమైన ఫొటోకు ఫోజిచ్చినందుకు థ్యాంక్స్ అని ఆమె ట్వీట్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విందుకు హ్యూమా ఖురేషీ, డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా హాజరయ్యారు.

అగ్రదర్శకుల హాజరు చర్చనీయాంశం

అగ్రదర్శకుల హాజరు చర్చనీయాంశం

సానియా మిర్జా బర్త్ డే పార్టీకి ఏకంగా తొమ్మిది మంది బాలీవుడ్ అగ్ర దర్శకులు హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఫరాఖాన్‌తో సానియా మిర్జాకు మంచి అనుబంధం ఉంది. గతంలో కూడా సానియాకు మంచి పార్టీని ఏర్పాటు చేసింది. 2015లో జరిగిన పార్టీకి రితేష్ దేశ్‌ముఖ్ దంపతులు, సోనాలి బింద్రే దంపతులు కూడా హాజరైన సంగతి తెలిసిందే.

సానియా బయోపిక్‌పై..

సానియా బయోపిక్‌పై..

సానియా మిర్జా బయోపిక్‌పై దర్శకురాలు ఫరాఖాన్ దృష్టిపెట్టింది. ఆమె జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించే విషయంపై ఫరా బృందం రీసెర్చ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రంలో నటించేందుకు పరిణితి చోప్రాను సంప్రదించినట్టు సమాచారం.

సానియాతో కాఫీ విత్ కరణ్

సానియాతో కాఫీ విత్ కరణ్

గత ఫిబ్రవరిలో కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోకు సానియాతో కలిసి ఫరా ఖాన్ హాజరయ్యారు. కరణ్ అడిగిన ప్రశ్నలకు సానియా, ఫరా తిరుగులేకుండా జవాబివ్వడం ప్రేక్షకులను ఉత్తేజానికి గురిచేసింది. వ్యక్తిగత జీవితంలో సానియా, ఫరాల రిలేషన్ ప్రత్యేకమైనదని బాలీవుడ్ వర్గాల అభిప్రాయం.

బాలీవుడ్‌తో మంచి రిలేషన్స్

బాలీవుడ్‌తో మంచి రిలేషన్స్

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులు, దర్శకులతో సానియాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో షారుక్ నటించిన దిల్‌వాలే షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ సెట్‌కు సానియా మిర్జా వెళ్లిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సెట్‌లోని వారికి ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యానీ తయారు చేయించి తీసుకెళ్లారు.

English summary
Director Farah Khan threws a party for Tennis Star Sania Mirza. It was a dinner party that was hosted by choreographer-turned-director Farah Khan at her house, exclusively for her director friends where her brother Sajid Khan, along with the director Akhtar siblings- Farhan and Zoya, Kabir Khan, Karan Johar, Sonali Bendre’s husband Goldie Behl, Punit Malhotra and Ashutosh Gowariker joined for the night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu