twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ ఆ పని చేశాడు.. డీజే ఆడియో రిలీజ్ వేడుకలో హరీష్ శంకర్

    డీజే ఆడియో రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌కు చెందిన అగ్రదర్శకులు వీవీ వినాయక్, శ్రీవాసు, వంశీ పైడిపల్లి బోయపాటి శ్రీను తదితరులు

    By Rajababu
    |

    ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంరక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దువ్వాడ జగన్నాథం (డీజే). ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై సినీ అభిమానులు అలరిస్తున్నాయి. ఈ చిత్రంలోని గుడిలో ఒడిలో పాట పురోహితులను కించపరిచే విధంగా ఉన్నదని బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజే ఆడియో రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేశారు.

    Director Harish Shankar speaks about allu Arujun in Duvvada Jagannadham Audio Release

    ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌కు చెందిన అగ్రదర్శకులు వీవీ వినాయక్, శ్రీవాసు, వంశీ పైడిపల్లి బోయపాటి శ్రీను తదితరులు హాజరయ్యారు. ఆదిత్య మ్యూజిక్ అందిస్తున్న ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దర్శకులు మాట్లాడారు.

    తొలి సినిమా ఆడకపోయినా

    తొలి సినిమా ఆడకపోయినా

    బృందావనం, ఊపిరి చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ నా మాతృసంస్థ. తొలి సినిమా ఆడకపోయినా మళ్లీ దర్శకులకు అవకాశం ఇచ్చిది దిల్ రాజు బ్యానర్ ఒక్కటే. దిల్ రాజుకు ఇది 25వ సినిమా. ఈ బ్యానర్ నుంచి ఇంకా చాలా సినిమాలు రావాలి అని వంశీ పైడిపల్లి అన్నారు.

    అర్జున్, హరీష్ శంకర్‌లో ఉండే ఎనర్జీకి

    అర్జున్, హరీష్ శంకర్‌లో ఉండే ఎనర్జీకి

    దర్శకుడు శ్రీవాసు మాట్లాడుతూ.. డీజే ట్రైలర్ చూశాను. అల్లు అర్జున్, హరీష్ శంకర్‌లో ఉండే ఎనర్జీకి రెండింతలు కనిపించింది. చాలా ఎమోషనల్‌గా ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

    తొలిసారి దర్శకత్వంలో

    తొలిసారి దర్శకత్వంలో

    నేను తొలిసారి దర్శకత్వంలో పనిచేసే అవకాశం కల్పించిన గురువు, డైరెక్టర్ వీవీ వినాయక్, తొలి సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజు ఒకే వేదిక మీద చాలా ఆనందంగా ఉంది. 25 సినిమాలు నిర్మించడం అంటే మూమూలు విషయం కాదు. ఎన్నో సమస్యలను అధిగమిస్తే తప్ప అదీ సాధ్యపడదు. అలాంటి వాటిని ఎన్నో అధిగమించి తన బ్యానర్‌ను అగ్రస్థానంలో నిలిచింది అని శ్రీకాంత్ అడ్డాల అన్నారు.

    15 మంది డైరెక్టర్లకు చూపించాలంటే

    15 మంది డైరెక్టర్లకు చూపించాలంటే

    ట్రైలర్‌ను ఇద్దరికి ముగ్గురికి చూపించాలంటే చాలా భయమేస్తుంది. అలాంటి 15 మంది డైరెక్టర్లకు చూపించాలంటే ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ట్రైలర్‌ను చూపించినప్పుడు అల్లు అర్జున్ యాక్షన్ సీన్ బోయపాటికి నచ్చి ఉంటుంది అని అనుకొన్నాను. సాధారణంగా వినాయక్ సినిమాలో విలన్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటాడు. ఈ సినిమాలో రావు రమేశ్ విలన్‌గా చూసి వినాయక్ ఇష్టపడి ఉంటాడు. డీజే ఎపిసోడ్ ఓ మై ఫ్రెండ్ దర్శకుడు వేణు శ్రీరాంకి నచ్చి ఉంటుందని అనుకొన్నాను. ఈ చిత్రంలో ఫస్ట్ టైం దర్శకుడిని నుంచి ఏ రాబట్టుకొన్నారో అది రాబట్టుకొన్నారు. కేవలం దర్శకుడి నుంచే కాదు. సాంకేతిక నిపుణులందరి నుంచి ఏం కావాలో అది రాబట్టుకొన్నారు అని దర్శకుడు హరీష్ అన్నారు.

    English summary
    Director Harish Shankar speaks about allu Arujun in Duvvada Jagannadham Audio Release
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X