»   » నన్ను క్షమించండి.... మీడియా ముందు సారీ చెప్పిన దర్శకుడు

నన్ను క్షమించండి.... మీడియా ముందు సారీ చెప్పిన దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఒక మంచి సినిమాని తీసాం కాని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కార‌ణంగా విడుద‌ల తేదీని కొంచెం మార్చాల్సి వ‌స్తోంది. ఈ సినిమాకోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు, వారంద‌రికి సారీ చెబుతున్నా." అంటూ "జనతా గ్యారేజ్" దర్శకుడు కొరటాల శివ యంగ్ టైగర్ అభిమానులకు సారీ చెప్పారు. జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దానికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో దర్శక నిర్మాతలు మాట్లాడారు.

''ఎన్టీఆర్‌ బాడీ లాంగ్వేజ్‌ మలయాళ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అతను నటించిన ప్రతి సినిమా అక్కడ రిలీజ్‌ అయ్యుంటే అక్కడ కూడా అతనికి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడేది. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. 'జనతా గ్యారేజ్‌' ఎన్టీఆర్‌కి అక్కడ మంచి లాంచ అవుతుందని మోహనలాల్‌గారు సినిమా మొదలైనప్పటి నుంచి చెబుతున్నారు. సినిమా రిలీజ్‌ అయ్యాక ఆయన అన్న ప్రతి మాట నిజం అవుతుంది'' అని కొరటాల శివ అన్నారు.


Director of Janata Garage Koratala Siva says Sorry to Jr.NTR Fans

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్‌'. సమంత, నిత్యామీనన నాయికలు, మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన ఎర్నేని, మోహన, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొరటాల శివ మాట్లాడుతూ ''మంచి సినిమా తీసినప్పుడు విడుదల తేదీని పొడిగించడంలో తప్పేమీ లేదు. సినిమా బాగా తీసి, కంగారుగా పోస్ట్‌ ప్రొడక్షన పనులు చేసేసి విడుదల చేస్తే ఫలితం మరోలా ఉంటుంది. అందుకే కావలసినంత సమయం తీసుకుని పోస్ట్‌ ప్రొడక్షన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.


దాంతో విడుదల ఆలస్యం అవుతోంది. సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సారీ చెబుతున్నా. మంచి ప్రొడక్ట్‌ను ప్రేక్షకులకు అందించడం కోసమే విడుదల తేదీలో చిన్న మార్పు చేశాం. ఇప్పటి వరకు చూడని ఎన్టీఆర్‌ని ఈ సినిమాలో చూస్తారు. కథలో ఉన్న స్పాన్ కు ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్‌ నటన ఉంటుంది. సినిమా రిలీజ్‌ డేట్‌ మారిందనగానే రీషూట్‌ అని, ఇంకేదో అని రకరకాల వార్తలొస్తుంటాయి. మా సినిమాకు ఆ అవసరం లేదు'' అని అన్నారు.


నిర్మాతలు మాట్లాడుతూ ''టాప్‌ టెక్నీషియన్లు, ఆర్టిస్ట్ లు పని చేసిన ఈ చిత్రం అందరూ గర్వపడేలా ఉంటుంది. ఆగస్ట్‌ ఒకటి లేదా రెండో వారంలో పాటల్ని విడుదల చేసి, సెప్టెంబర్‌ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అని చెప్పారు.

English summary
Koratala Siva says Sorry to Jr.NTR Fans at Janatha Garage Movie Release Date Press Meet. NTR's upcoming movie janatha garage directed by Koratala Siva and produced by Naveen Yerneni, Y. Ravi Shankar, and C. V. Mohan under their banner Mythri Movie Makers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu