twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడు రాఘవేంద్రరావుకు జరిమానా

    By Srikanya
    |

     K. Raghavendra Rao
    హైదరాబాద్ ‌: కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు నిబంధనలు అమలు కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేసే పనిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లను ఆపి వాటిని తొలగిస్తున్నారు. ఈ నేపధ్యంలో సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ప్రయాణిస్తున్న కారు అద్దాలకు నల్ల పొర ఉందని జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మీదుగా సినీమ్యాక్స్‌వైపు వెళుతుండగా ట్రాఫిక్‌ పోలీసులు ఆయన ప్రయాణిస్తున్న కారును ఆపి రూ.100 చలానా రాసి పంపారు

    ఇంతకు ముందు హీరో సునీల్ కారుకు కూడా బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పోలీసులు రూ.100 జరిమానా విధించారు. అయితే అప్పుడు తొలి రోజు కావును రూ.100 జరిమానా విధుస్తున్నామని, రేపటి నుంచి కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంటే రూ.500 జరిమానా విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ వంద రూపాయలు మాత్రమే జరిమానా విధిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు నాలుగు చక్రాల వాహనదారులపై ఒక్కసారిగా కొరడా ఝళిపించారు. కార్ల అద్దాలకు నల్ల రంగు ఫిల్ములను అమర్చడాన్ని సుప్రీం కోర్టు నేరంగా పరిగణించడంతో ట్రాఫిక్ పోలీసులు గురువారం నుంచీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటువంటి కార్లకు జరిమానాలు విధించడం ప్రారంభించారు.

    దుండగులు వాహనాలకు నల్లటి ఫిల్ములు కలిగిన అద్దాలను ఉపయోగించి తద్వారా అత్యాచారాలు, అపహరణలు మొదలైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, వీటిని అదుపు చేసేందుకు గానూ వాహనాలకు నల్లటి ఫిల్ముల ఉపయోన్ని సుప్రీం కోర్టు నిషేధించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేసి, వాహనాల అద్దాలకు పరిమితులకు మించి టింట్ చేయబడి ఉన్నట్లయితే జరిమానా విధంచడమే కాకుండా ఆన్‌-ది-స్పాట్‌లోనే సన్‌ఫిల్మ్‌లను తొలగించడం జరుగుతుంది.

    "మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు విండ్‌స్క్రీన్స్ (ముందు వైపు అద్దం), రియర్ విండో (వెనుక వైపు అద్దం) లపై 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్ (విఎల్‌టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్‌టిని కలిగి ఉండాలి". సాధారణంగా వాహనాలను తయారు చేసే కంపెనీలు ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకొనే అద్దాలను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్‌లపై ఏ రకమైన సన్ ఫిల్ములను ఉపయోగించిన అది చట్ట వ్యతిరేకమే అవుతుంది.

    English summary
    Traffic police have started strictly implementing the supreme court's direction to take action against cars with dark films on the windows. Director K. Raghavendra Rao was stopped by the police. He was fined Rs. 100 for continuing to use dark films on the windows. Police are stopping vehicles vehicles at several junctions in the city and are slapping fines on vehicles having dark films on their windows.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X