For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదిరిపోయే స్కెచ్ వేసిన మారుతి.. సినిమాల్లోకి డాటర్ ఎంట్రీ

  |

  సినీ రంగంలో స్థిరపడ్డ వారు తమ వారసుల్ని పరిచయం చేస్తూ ఉంటారు. సినీ ప్రపంచంలో వారసత్వం అనేది పాతుకపోయిందని చాలా మంది కామెంట్లు వస్తుంటాయి. అయితే వారసత్వం అన్నదే ప్రాతిపదిక కాదని ప్రతిభ ఉన్న వారెవరైనా రాణించవచ్చని ఎంతో మంది నిరూపించారు. అలా స్టార్ కిడ్స్‌కు నిరూపించుకోవడానికి అవకాశాలు మాత్రం సులభంగా లభిస్తాయి.

  స్టార్ డైరెక్టర్‌గా మారిన మారుతి..

  స్టార్ డైరెక్టర్‌గా మారిన మారుతి..

  ఒకప్పుడు బూతు సినిమాల దర్శకుడంటూ మారుతిని ఎందరో విమర్శించారు. ఎప్పుడైతే భలే భలే మగాడివోయ్ లాంటి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాడో అప్పటి నుంచి అతనిపై ఆ ముద్ర చెరిగిపోయింది. ప్రస్తుతం మెగా కాంపౌండ్‌లో మేగా మేనల్లుడి చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.

  రిలీజ్‌కు సిద్దమైన చిత్రం..

  రిలీజ్‌కు సిద్దమైన చిత్రం..

  మెగా మేనల్లుడు సాయిధరమ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో `ప్రతి రోజు పండగే` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెండింగ్ పనులు శర వేగంగా పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రచారం లో వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. పోస్టర్లు లిరికల్ వీడియోల తో వేడెక్కిస్తున్నారు.

  తమన్ బర్త్‌డే సందర్భంగా..

  తమన్ బర్త్‌డే సందర్భంగా..

  తమన్ బర్త్‌డే సందర్భంగా తాజాగా ఓ లిరికల్ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేసారు. `బావా మా అక్క ను సక్కగా సూస్తావా?` అంటూ సాగే పాట టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పాట టీజర్ లో రాశీ ఖన్నా ఓ పల్లె పట్టు సుందరిగా దర్శనమిస్తోంది. రాశీ అక్కను ఆట పట్టించే చెల్లెమ్మ గా ఓ అమ్మాయి (ఎడమవైపు) కనిపిస్తోంది చూశారా?. తను మరెవరో కాదు డైరెక్టర్ మారుతి కుమార్తె.

  అనేక కళల్లో ప్రావీణ్యం..

  అనేక కళల్లో ప్రావీణ్యం..

  భరత నాట్య కళాకారిణి గానూ తళుక్కున మెరిసిన ఆ అమ్మాయి పేరు అభీష్ట. ఇలా తనని చూడగానే తండ్రికి తగ్గ తనయురాలు అని పొగిడేయకుండా ఉండలేం. సినిమాలంటే అభీష్టకు ఆసక్తి. పైగా నాట్యం లో ప్రావీణ్యం ఉంది.. ఆమెకు తండ్రిలానే చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం ఉందట. అందుకే మారుతి తన కుమార్తెను ఈ చిత్రంతో పరిచయం చేయించి అదిరిపోయే స్కెచ్ వేశాడు. మరి మున్ముందు తన కూతురును హీరోయిన్‌గా కూడా పరిచయం చేస్తాడేమో చూడాలి.

  #CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
  డ్రమ్స్ వాయిస్తూ వైరల్

  డ్రమ్స్ వాయిస్తూ వైరల్

  మారుతికి ఇద్దరు సంతానం. కుమార్తె ఆర్ట్ (డ్రాయింగ్) పరంగా శిక్షణ పొందుతుంటే.. కుమారుడు డ్రమ్స్ సహా ఇండియన్ క్లాసిక్ .. పాశ్చాత్య బాణీల్ని నేర్చుకుంటున్నాడు. ఆ మధ్య స్కూల్ ఫంక్షన్‌లో డ్రమ్స్ వాయించి.. అదరగొట్టేశాడు. ఆ వీడియోను మారుతి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ తెగ ఆనందపడిపోయిన సంగతి తెలిసిందే.

  English summary
  Director Maruthi Daughter Acts In Prathi Roju Pandaga Movie. Starred By raashi Khanna, Sathyraj And Rao ramesh.This Movie Relesaing On 20th December.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X