twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీస్ స్టేష‌న్‌లో నితిన్ సినిమా డైరెక్ట‌ర్‌ ఫిర్యాదు.. కులాల రొచ్చులో దింపారు.. సంబంధం లేదంటూ!

    |

    మాచర్ల నియోజకవర్గం సినిమా దర్శకుడు ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్యంగా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఆయన చేసినట్లుగా ఉన్న పాత ట్వీట్లను ఇప్పుడు తెరమీదకి తీసుకువచ్చి మరి వైరల్ చేస్తూ ఉండడంతో ఇప్పటికే నితిన్ సహా స్వయంగా రాజశేఖర్ రెడ్డి కూడా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా తాను మాట్లాడలేదని ఆ ఇద్దరూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా రాజశేఖర్ రెడ్డి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    సోషల్ మీడియాలో

    సోషల్ మీడియాలో

    టాలీవుడ్ లో సుమారు 50 సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డి నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం సినిమాతో దర్శకుడుగా మారుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల దగ్గర పడడంతో సినిమా నుంచి విడుదలైన పాటలు అలాగే పోస్టర్లు సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడేలా చేశాయి. అయితే అనూహ్యంగా రాజశేఖర్ రెడ్డి గతంలో కమ్మ కులాన్ని కాపు కులాన్ని టార్గెట్ చేస్తూ దారుణంగా అవమానించినట్లుగా ఉన్న కొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఖండిస్తున్నానని

    ఖండిస్తున్నానని

    అయితే తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిని అన్నమాట నిజమే కానీ తాను వేరే కులాలను కించపరిచే విధంగా ఎలాంటి కామెంట్లు చేయలేదని ఆయన సోషల్ మీడియా వేదిక క్లారిటీ ఇచ్చారు. అది రీ ట్వీట్ చేసిన నితిన్ కూడా ఇలా ఫేక్ ట్వీట్లను వైరల్ చేయడం కరెక్ట్ కాదని ఇది చాలా దారుణమైన విషయం అని తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఈ విషయం ఇలాగే వదిలేస్తే ఇబ్బంది అని భావించిన దర్శకుడు, సినిమా నిర్మాత నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

    సంయుక్తంగా

    సంయుక్తంగా


    సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన పేరు మీద ఫేక్ ట్వీట్లు చేసి తప్పుగా పోస్ట్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఇక సినిమా విషయానికొస్తే మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అంజలి ఒక స్పెషల్ సాంగ్ చేయగా ఇప్పటికే ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నితిన్ సోదరి నికిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    యూనిట్ అప్రమత్తమై

    యూనిట్ అప్రమత్తమై


    చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ సినిమాతో హిట్టు అందుకోగలరని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే సినిమా ముందు ఇలా కులాల వివాదం తీసుకురావడంతో పాటు సినిమా చూడకుండా బ్యాన్ చేయాలి అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ అప్రమత్తమైంది.

    ఎడిటర్ గా

    ఎడిటర్ గా


    ఏకంగా కాపు కమ్మ కులాల వాళ్ళు ఎవరూ సినిమా చూడకూడదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండడంతో ముందుగానే యూనిట్ జాగ్రత్త పడింది. ఇక రాజశేఖర్ రెడ్డి గతంలో ఎన్టీఆర్ నటించిన టెంపర్, మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ లాంటి సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించారు. అవి మాత్రమే కాక పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు ఆయన ఎడిటర్ గా వ్యవహరించినట్లు సమాచారం.

    English summary
    'Macherla Niyojakavargam' director MS Rajashekar Reddy today filed a complaint with the Cyber Crime Department in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X