For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అది రాజమౌళికే సాధ్యం, ఎన్టీఆర్‌ తప్పుకోవడం మంచిదే: ప్రభాకర్

  By Bojja Kumar
  |

  ఈటీవీలో ప్రసారం అయ్యే టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయి... ఈటీవీని తన ఇంటి పేరుగా మార్చుకున్న ప్రభాకర్ ప్రస్తుతం సినిమా రంగం వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. నెక్ట్స్ నువ్వే, బ్రాండ్ బాబు చిత్రాలు చేసిన ఈ డైరెక్టర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా ఏదైనా కంటెంటు బావుండాలి, అది ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉన్నపుడే బాగా ఆడతాయి. ప్రేక్షకుల మెప్పు పొందక పోతే ఎంత గొప్ప సినిమా అయినా డీలా పడాల్సిందే అన్నారు. అలాంటి సినిమాలు తీయడంలో రాజమౌళిని మించిన వారు లేరని ప్రభాకర్ చెప్పుకొచ్చారు.

  అదే స్టోరీని బాహుబలిగా తీశారు

  అదే స్టోరీని బాహుబలిగా తీశారు

  బాహుబలి సినిమాను రాజమౌళి డీల్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. కథ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. కానీ రాజమౌళి దాన్ని ఓ రేంజికి తీసుకెళ్లారు. అసలు బాహుబలిలో పెద్ద కథేముంది? ఒక వ్యక్తి... వాడికి తమ్ముడు, అమ్మ మాత్రం ఇద్దరినీ చేరదీస్తుంది. అన్న విలన్‌గా మారి అమ్మను, తమ్మడిని దూరం చేస్తారు. చివరకు అమ్మతో సోదరుడిని చంపేలా చేయిస్తాడు. చత్రపతి కథ కూడా ఇలాంటిదే.... అని ప్రభాకర్ తెలిపారు.

  రాజమౌళి ఏదైనా చేయగలడు

  రాజమౌళి ఏదైనా చేయగలడు

  తాను ఎలాంటి సినిమా అయినా చేయగలను అని రాజమౌళి నిరూపించారు. బాహుబలి సినిమా చూసినంతసేపు గూస్ బంప్స్. ప్రభాస్ ఎంట్రీనే అద్భుతంగా ఉంటుంది. ఒక మంచి టెక్నీషియన్ ఏదైనా చేయగలడని, అందుకు రాజమౌళి ఉదాహరణ అని ప్రభాకర్ అభిప్రాయ పడ్డారు.

  అలాంటివి నా వల్ల కాదు

  అలాంటివి నా వల్ల కాదు

  నేను బాహుబలి రేంజి సినిమాలు చేయలేను. సెంటిమెంట్ మాత్రమే బాగా చేయగలను. నా సీరియల్స్ అన్నీ టాప్ లో ఉండటానికి కారణం అదే. రిలేషన్స్ బాగా చూపించగలను. నా లైఫ్ లో కూడా రిలేషన్స్ ఎక్కువ... అని ప్రభాకర్ తెలిపారు.

  బిగ్‌బాస్ కోసం అడిగారు

  బిగ్‌బాస్ కోసం అడిగారు

  బిగ్‌బాస్ అంటే ఎప్పుడూ ఇష్టమే. మొదటి సీజన్లో పార్టిసిపేట్ చేయమని అడిగారు. కానీ అపుడు నా ఫస్ట్ మూవీ మొదలవుతుండటంతో నో చెప్పాను. సెకండ్ సీజన్లో నన్ను అనుకోవడానికే ఛాన్స్ కూడా లేదు... ఎందుకంటే అప్పటికే నేను ‘బ్రాండ్ బాబు' చేస్తూ ఉన్నాను.

  ఎన్టీఆర్, నాని లాంటోళ్లు వస్తే మమ్మల్ని ఎవరు చూస్తారు?

  ఎన్టీఆర్, నాని లాంటోళ్లు వస్తే మమ్మల్ని ఎవరు చూస్తారు?

  నేను ఎప్పటికైనా మళ్లీ బుల్లితెరకు వస్తాను. యాంకర్‌గా వస్తానో... కంటెస్టెంటుగా వస్తానో తెలియదు. యాంకర్‌గా వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎన్టీఆర్ లాంటోళ్లు చేసిన తర్వాత మనలాంటి వారిని ఎవరు చూస్తారు? ఇపుడు నాని వచ్చారు... అని ప్రభాకర్ అన్నారు.

  ఎన్టీఆర్, నాని ఎవరు బెస్ట్ అంటే..

  ఎన్టీఆర్, నాని ఎవరు బెస్ట్ అంటే..

  బిగ్‌బాస్ విషయంలో ఎవరి స్టైల్ వారిది. ఎన్టీఆర్ గారిది ఒక స్టైల్. నానిది ఇంకో స్టైల్... కంపేర్ చేయలేం. బాహుబలి 1 సూపర్ హిట్టా? బాహుబలి 2 సూపర్ హిట్టా అంటే చెప్పలేం. బాహుబలి 1 లేకుంటే బాహుబలి 2లో స్టోరీయే లేదు. అలా అని మొదటి భాగంతో ఆగలేం కదా.. అంటూ తనదైన శైలిలో స్పందించారు.

  ఎన్టీఆర్‌ను మార్చడం మంచిదే

  ఎన్టీఆర్‌ను మార్చడం మంచిదే

  ఎన్టీఆర్‌ను మార్చడం కూడా మంచిదే బోర్ కొట్టకుండా ఉంటుంది. హిందీలో సల్మాన్ ఖాన్ నాలుగైదు సీరీస్‌లు చేశాడు. ఎన్టీఆర్ డేట్స్ దొరకడమే కష్టం. ఆయన సినిమాలు, ఫ్యాన్స్‌తో చాలా బిజీగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఒక టెలివిజన్ షో ఒప్పుకోవడమే గొప్ప. ఆయన ఒప్పుకున్న తర్వాత ధైర్యంగా మిగతావారు వస్తున్నారు కానీ... లేకుంటే వీరు వచ్చేవారు కాదేమో? అని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

  అలా అనడం తప్పు

  అలా అనడం తప్పు

  జనరల్‌గా పబ్లిక్‌లో ఉన్న ఓపీనియన్.... ఎన్టీఆర్ తర్వాత ఆయన్ను మించిన వారిని తీసుకురావాలి. కానీ నాని లాంటి కాస్త తక్కువ రేంజి ఉన్న స్టార్ రావడం వల్ల బిగ్ బాస్ డౌన్ అయిందనే వాదన సరికాదు...అసలు అలా అనడం తప్పు. షో ఏ మాత్రం డౌన్ కాలేదు. సెకండ్ సీజన్ కూడా బాగా నడుస్తోందని ప్రభాకర్ అన్నారు. షో టీఆర్పీ రేటింగ్స్ అనేవి అనేక విషయాలపై ఆధారపడి ఉంటుదని అన్నారు.

  English summary
  Brand Babu Director Prabhakar said that Rajamouli is tha great technician in Tollywood Industry. Talking about Bigg Boss Telugu show.... Prabhakar said NTR and Nani both are best in Bigg Boss hosting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X