»   » నటిపై రేప్ జరగలేదు, వివస్త్రను చేసి ఫొటోలు తీసారు

నటిపై రేప్ జరగలేదు, వివస్త్రను చేసి ఫొటోలు తీసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మళయాళ నటిపై దుండగులు దాడికి పాల్పడ్డారన్న వార్త సినీప్రపంచాన్నే కాకుండా సాధారణ మహిళలను సైతం దిగ్బ్రాంతి కిగురిచేసింది. ఆమెకు సంఘీభావం తెలుపుతూ పలువురు నటీనటులు సోషల్‌ మాధ్యమాల్లో సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఒక టాప్ హీరోయిన్ పై ఈ స్థాయి ఘటన చోటుచేసుకోవడం మలయాళ ఇండస్ట్రీ వర్గాలలో కలకలం రేపింది.

'ఒంటరి' చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమె అచ్చ తెలుగు అమ్మాయిలా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత నితిన్ తో 'హీరో,' కృష్ణవంశీ , శ్రీకాంత్ ల కలయికలో వచ్చిన 'మహాత్మా,' రవితేజ 'నిప్పు' సినిమాలలో నటించింది. తెలుగులో అంతంత మాత్రపు అవకాశాలే వచ్చినప్పటికీ, మలయాళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాంటి నటి మీద, అదీ రద్దీగా ఉండే సిటీలో ఇలా జరటం దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తానికి షాక్ గా మారింది...

Director Priyadarshan says she was not raped

ఈ మిస్టరీని రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల్లో ఒకడైన మణికందన్ ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. సునీల్‌కుమార్ అలియాస్ పల్సర్ సునినే ఈ కుట్రకు ప్లాన్ గీశాడని, అతని స్కెచ్ ప్రకారమే నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన జరిగిందని తెలిపాడు.

ఒక పని ఉందంటూ పల్సర్ సుని కాల్ చేసి తమను పిలిచాడని చెప్తూ.."ఎవరినో కొట్టేందుకు అతను పిలిచి ఉంటాడని నేను భావించాను..కానీ భావన మీద దాడి చేసేందుకు మమ్మల్ని పిలిచాడని తర్వాత తెలిసింది". అంటూ ఆ ఘటన తర్వాతి విషయాలను కూడా చెప్పాడు. నటిపై దాడి తర్వాత డబ్బు కోసం ఈ కుట్రలో భాగం పంచుకున్న ఇతర వ్యక్తులు డబ్బు కోసం సునితో గొడవ పడ్డారని, వారికి రూ.30 లక్షలు తర్వాత ఇస్తానని ఒప్పించి తర్వాత అడ్రస్ లేకుండా పోయాడని చెప్పాడు.

అయితే మీడియా కథనాలు మాత్రం ఆ నటికి తలనొప్పిగా మారాయట. ఎందుకంటే ఆమెను కిడ్నాప్‌ చేసి గ్యాంగ్‌‌రేప్‌ చేసారంటూ ఆంగ్ల మీడియా రిపోర్ట్‌ చేస్తోంది. పోలీసులు కూడా ఆమెది రేప్‌‌కేస్‌గానే పరిగణిస్తూ అవే సెక్షన్ల కింద నిందితులని అరెస్ట్‌ చేసారు. అయితే ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ మీడియాతో మాట్లాడుతూ తాను ఆమెతో మాట్లాడానని, రేప్‌ జరగలేదని, మీడియా ఇలా తెలిసీ తెలియని ప్రచారాలు చేయడం భావ్యం కాదని అన్నారు.

ఆమెని అపహరించి, వివస్త్రని చేసి ఫోటోలు తీసారని, తద్వారా ఆమెని బెదిరించి డబ్బులు అడుగుదామని అనుకుని వుంటారని ఆయన చెప్పారు. తెలిసిన వాళ్లే ఈ విధంగా చేయడం ఆశ్చర్య పరుస్తోందని, ఆమె సైలెంట్‌గా వుంటుందని, పోలీసులని ఆశ్రయించదని ఎలా ఆలోచించారో అర్థం కావడం లేదని చెప్పాడు.

English summary
“First of all, she was not raped. How can something so grave and evil be trivialised by wrong reportage? I spoke to her after the awful incident and she very clearly told me she was NOT raped. Yes, she was abducted apparently by her former driver and his friends" said Director Priyadarshan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu