For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR 2పై రాజమౌళి సంచలన ప్రకటన: మళ్లీ ఆయనకే బాధ్యతలు.. స్టోరీలైన్ ఇదేనంటూ!

  |

  టాలీవుడ్ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). దేశమే గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో టాలీవుడ్‌ను ఏలుతోన్న ఇద్దరు స్టార్లు కలిసి నటించారు. దీంతో ఈ మూవీ రేంజ్ తారాస్థాయికి చేరింది. అందుకు అనుగుణంగానే ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో RRR పార్ట్ 2పై తాజాగా రాజమౌళి స్పందించారు. ఆ విశేషాలు మీకోసం!

  ఇద్దరు స్టార్లతో రాజమౌళి మ్యాజిక్

  ఇద్దరు స్టార్లతో రాజమౌళి మ్యాజిక్

  టాలీవుడ్ స్టార్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంగా చేశారు.

  బ్రాతో బిగ్ బాస్ దివి అరాచకం: బాడీ మొత్తం చూపిస్తూ హాట్ వీడియో

  అన్ని వందల కోట్లు రాబట్టిందిగా

  అన్ని వందల కోట్లు రాబట్టిందిగా

  విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షించిన RRR మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 613.06 కోట్లు షేర్, రూ. 1150.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. దీంతో ఎన్నో రికార్డులు కూడా నమోదు అయ్యాయి.

  ఓటీటీతో ప్రపంచ వ్యాప్తంగా హవా

  ఓటీటీతో ప్రపంచ వ్యాప్తంగా హవా

  థియేటర్లలో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ భారీ ప్రభావాన్ని చూపించిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో ఓటీటీలోనూ ఈ మూవీ అదే దూకుడును ప్రదర్శించింది. ఫలితంగా స్ట్రీమింగ్ చేసిన జీ5, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌లలో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కాయి. అంతేకాదు, ఈ చిత్రం ఎన్నో అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకుంది.

  శృతి మించిన శివాత్మిక బోల్డు షో: ఆ డ్రెస్సేంటి.. ఆ ఫోజులేంటి బాబోయ్!

  జపాన్‌లో రిలీజ్.. భారీ వసూళ్లతో

  జపాన్‌లో రిలీజ్.. భారీ వసూళ్లతో

  పాన్ ఇండియా రేంజ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ అత్యధిక వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని కొద్ది రోజుల క్రితమే జపాన్‌లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఈ చిత్రానికి భారీ స్పందన దక్కింది. దీంతో జపాన్ దేశంలోనూ ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసింది. తద్వారా పలు రికార్డులు నమోదు చేసింది.

  స్పెషల్ స్క్రీనింగ్.. సీక్వెల్‌ కోసం

  స్పెషల్ స్క్రీనింగ్.. సీక్వెల్‌ కోసం

  RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ ఆస్కార్ రేంజ్‌లో హైలైట్ అయింది. దీంతో ఇప్పటికీ ఈ సినిమా హడావిడి అన్ని దేశాల్లోనూ కనిపిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు యూఎస్‌లోని చికాగోలో 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ స్క్రీనింగ్స్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడాడు. ఇందులో ఈ మూవీ సీక్వెల్‌పై ఆయనకు ప్రశ్న ఎదురైంది.

  రాజమౌళి సంచలన ప్రకటనతో

  'ఆర్ఆర్ఆర్' స్పెషల్ స్క్రీనింగ్స్ సందర్భంగా హోస్ట్ ఈ మూవీ సీక్వెల్ గురించి రాజమౌళిని ప్రశ్నించింది. దీనికాయన 'ఇది అప్పుడే చెప్పకూడదు.. కానీ.. నా సినిమా కథలన్నీ మా నాన్నగారు చూసుకుంటారు. మా మధ్య RRR పార్ట్ 2 గురించి కూడా చర్చ వచ్చింది. ఈ స్టోరీపైన మా నాన్న, టీమ్ వర్క్ చేస్తున్నారు' అని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  స్టోరీలైన్ ఇదేనంటూ ప్రచారాలు

  స్టోరీలైన్ ఇదేనంటూ ప్రచారాలు


  దర్శకధీరుడు రాజమౌళి RRR పార్ట్ 2 గురించి సానకూలంగా స్పందించడంతో.. దీనికి సంబంధించిన స్టోరీలైన్‌పై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. సీక్వెల్‌లో ఇద్దరు హీరోలు తమ తమ ప్రాంతాల కోసం వేరు వేరుగా పోరాటం చేయడాన్ని చూపించబోతున్నారని ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

  English summary
  Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. This Film Create So Many Record at Box Office. Now Rajamouli Gave Clarity on This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X