Don't Miss!
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- News
ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు.. భర్తపై యాసిడ్ పోసిన ఇల్లాలు!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ప్రభాస్ రూ.80 కోట్లు.. సల్మాన్‌తో బాలీవుడ్ సినిమా తుస్సే.. తేల్చేసిన రోహిత్ శెట్టి
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్నదన్న రూమర్లకు దర్శకుడు రోహిత్ శెట్టి తెరదించారు. ప్రభాస్, సల్మాన్ కలయికలో సినిమా వస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన వివరణ ఇచ్చారు. బాలీవుడ్‌లో ఓ మల్టీ స్టారర్ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి వివరణ ఇవ్వడంతో బాలీవుడ్ ప్రభాస్ ఎంట్రీ తుస్సేనని తేలిపోయింది.

సల్మాన్, ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా..
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దర్శక, నిర్మాత కరణ్ జోహార్ చిత్రంలో ప్రభాస్ నటించడం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారని, ఆ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారనే రుమార్లు షికారు చేశాయి. అయితే అధికారికంగా ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్, రాజమౌళి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ వార్త పక్కన పెట్టి తాజాగా సల్మాన్ ఖాన్, ప్రభాస్ కాంబినేషన్‌లో చిత్రమంటూ కొత్త వార్త వెలుగు చూసింది.

రూమర్లు ఎక్కడ నుంచి వస్తాయో
ప్రభాస్, సల్మాన్ ఖాన్ సినిమా అనే వార్తలో ఎలాంటి నిజం లేదు. అంతా ఉత్తిదే. గత మూడు వారాలుగా ఫియర్ ఫ్యాక్టర్ షూటింగ్‌లో ఉన్నాను. ఈ రూమర్లు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియవు అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి గోల్‌మాల్ అగైన్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, పరిణితి చోప్రా, టబూ, అర్షద్ వార్సీ, కునాల్ ఖేము, తుషార్ కపూర్ నటిస్తున్నారు.

ప్రభాస్ రూ.80 కోట్ల రెమ్యునరేషన్
సల్మాన్ ఖాన్‌తో చేసే సినిమా కోసం ప్రభాస్ రూ. 80 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశారనే వార్త హల్‌చల్ చేసింది. అయితే ఆ వార్త రూమర్‌పై అటు ప్రభాస్ కానీ, మరొకరు గానీ స్పందించలేదు. ఈ మధ్యలోనే రోహిత్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ అలాంటిదేమీ లేదని ప్రకటన చేశారు.

ఖాన్లు, కపూర్లకు అంత లేదు..
బాలీవుడ్ చిత్రానికి భారీగా పారితోషికం డిమాండ్ చేశారనే వార్త చర్చనీయాంశమైంది. బాలీవుడ్‌లో ఖాన్లు, కపూర్ల లాంటి హీరోలకు అంత రెమ్యునరేషన్ లేదు.. ప్రభాస్ ఎలా డిమాండ్ చేస్తారనే వాదన మొదలైంది. గాసిప్ రాయుళ్ళు ప్రచారం చేసిన వార్త ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపింది. కానీ అసలు విషయం బయటపడటంతో అభిమానులు నీరసపడ్డారు.

రిలీజ్‌కు సిద్ధమవుతున్న ట్యూబ్‌లైట్
ప్రస్తుతం సల్మాన్ నటించిన ట్యూబ్‌లైట్ చిత్రం జూన్ 23న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో టైగర్ జిందా హై చిత్రంలో కూడా సల్మాన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ సరసన కత్రినాకైఫ్ నటిస్తున్నది.

సాహోకు ప్రభాస్ రెడీ
ఇదిలా ఉండగా, బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహో చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విలన్ పాత్రలో కనిపించనున్న నీల్ నితిన్ ముఖేష్‌పై ఇటీవల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర ఎంపికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది.