twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కడ సినిమా చెయ్యడం అంటే అడుక్కున్నట్టు ఉంటుంది: శేఖర్ కమ్ముల

    హాలీవుడ్లో సినిమాలు చేయడం తన వల్లకాదని శేఖర్ కమ్ముల తెలిపారు. తనది కాని నేటివిటీలో సినిమాలు తీయడం తన వల్ల కాదన్నారు.

    By Bojja Kumar
    |

    హ్యాపీడేస్, ఆనంద్, గోదావరి లాంటి హిట్ చిత్రాలను, ఫీల్ గుడ్ చిత్రాలను అందించిన శేఖర్ కమ్మల ఆ తర్వాత భారీ హిట్ అందుకోవడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎట్టకేలకు ఆయన 'ఫిదా' సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చారు.

    'ఫిదా' మూవీ ఊహించిన దానికంటే పెద్ద హిట్ కావడంతో శేఖర్ కమ్ముల మళ్లీ పాపులర్ సెలబ్రిటీ అయిపోయారు. వివిధ మీడియా ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. శేఖర్ కమ్ముల సినిమాల్లోకి వచ్చే ముందు అమెరికాలోని ఫిల్మ్ స్కూల్‌లో చదువుకున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఇందకు సంబంధించి కొన్ని విషయాలు పంచుకున్నారు.

    డాలర్ డ్రీమ్స్

    డాలర్ డ్రీమ్స్

    శేఖర్ కమ్ముల ‘డాలర్ డ్రీమ్స్' అనే సినిమాతో కెరీర్ మొదలు పెట్టారు. ఈ చిత్రం ఇంగ్లిష్, తెలుగులో ద్విబాషా చిత్రంగా తెరకెక్కింది. ఫిల్మ్ స్కూల్‌ నుండి బయటకు వచ్చిన అనంతరం తీసిన సినిమా ఇది.

    Recommended Video

    Sekhar Kammula at Geeta Bhaskar's Destiny's Child Book Launch
    అడుక్కున్నట్లు ఉంటుంది

    అడుక్కున్నట్లు ఉంటుంది

    ‘డాలర్ డ్రీమ్స్' చేసిన తర్వాత అమెరికాలో ఉండి ఉంటే మీరు ఆస్కార్ లెవల్ కి వెళ్లేవారా? అనే ప్రశ్నకు శేఖర్ కమ్ముల స్పందిస్తూ.... అది పేరుకు ‘డాలర్ డ్రీమ్స్' సినిమా అయినా ఇక్కడ హైదరాబాద్ లో మన చుట్టూ జరిగే అంశాలపై తీసిన సినిమా. నేను అమెరికాలో ఫిల్మ్ స్కూల్ లో చదివినపుడు హాలీవుడ్లో ఇంటర్న్ షిప్ చేసే అవకాశం వచ్చింది. కానీ వెళ్లలేదు. అక్కడ నేను కథలు చెప్పలేను అని ఇండియా వచ్చేశాను. హాలీవుడ్ అనేది మనకు తెలియని నేటివిటీ చుట్టూ తిరిగే సినిమాల ప్రపంచం. అక్కడ సినిమాలు చేయడం అంటే అడుక్కున్నట్లే ఉంటుందని శేఖర్ కమ్ముల తెలిపారు.

    అక్కడి వాడినికి కాదు కాబట్టి తెలియదు

    అక్కడి వాడినికి కాదు కాబట్టి తెలియదు

    నేను నాలుగేళ్ల వయసులోనే హైదరాబాద్ పద్మారావు నగర్ ఏరియాకు వచ్చాను. ఇక్కడే పెరిగాను. నేను నా చుట్టూ జరిగిన విషయాలను మాత్రమే ఇంపాక్టుగా చెప్పగలను. ఐదేళ్లు అమెరికాలో చదువుకున్నంత మాత్రాన బయటి సినిమాలు చేయలేను. అమెరికా అంటే చాలా ఇష్టం, చాలా తెలుసు, చాలా నేర్చుకున్నాను. నేను అక్కడోన్ని కాదు కాబట్టి అక్కడి సినిమాలు తీయలేను... అని శేఖర్ కమ్ముల తెలిపారు.

    ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తీయగలను

    ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తీయగలను

    హాలీవుడ్లో అయినా మన కథ మాత్రమే చెప్పగను, దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తీయగలను... మన నేటివిటీ లేని సినిమాలను నేను తీయలేను అని శేఖర్ కమ్ముల స్పష్టం చేశారు.

    సాయి పల్లవి మదర్ ఒప్పుకోలేదు

    సాయి పల్లవి మదర్ ఒప్పుకోలేదు

    సాయిపల్లవిని ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సమయంలోనే ఓ క్యారెక్టర్ కోసం అనుకున్నాం. డిగ్రీ చేసే సమయంలో వెళ్లి కలిశాం. కానీ వాళ్ల అమ్మ ఒప్పుకోలేదు. తన కూతురు ఎంబీబీఎస్ చేయడానికి వెలుతుందని, అది పూర్తయిన తర్వాతే సినిమాలైనా, మరేదైనా అని చెప్పారు... అని శేఖర్ కమ్ముల వెల్లడించారు.

    బ్యాడ్ స్కూల్ సిస్టం

    బ్యాడ్ స్కూల్ సిస్టం

    మీ పిల్లలను సినిమా రంగంలోకి తీసుకొస్తారా? అని అడిగిన ప్రశ్నకు శేఖర్ కమ్ముల స్పందిస్తూ.... ముందు వాళ్లు చదువు పూర్తి చేసిన తర్వాత నిర్ణయం వారికే వదిలేస్తాను. ప్రస్తుతం ఉన్న మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం నచ్చలేదు. వాళ్లని ఎంసెట్, ఇంజనీరింగ్ లాంటి చట్రంలోకి వెళ్లనివ్వను. అదే సమయంలో చదువులో వెనకబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు శేఖర్ కమ్ముల తెలిపారు.

    English summary
    'I do not know about American Nativity, I did not do movies in Hollywood.' Director Sekhar Kammula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X