For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3.0 ఉంటుందా? 2.0 సీక్వెల్‌పై దర్శకుడు శంకర్ ఏమన్నారంటే?

|

రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 2010లో వచ్చిన 'రోబో' ఇండియా వ్యాప్తంగా సంచలన విజయం సాధించగా... దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత దానికి సీక్వెల్‌ 2.0 ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమైంది. భారత దేశంలో ఇప్పటి వరకు ఏ సినిమాకు ఖర్చు పెట్టనంతగా దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో చిట్టి పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో విలన్ పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కనిపించబోతుండటం సినిమాకే హైలెట్. ఇండియన్ సినీ చరిత్రలో గొప్ప విజువల్ వండర్‌గా ఈ చిత్రం ఉంటుందనే అంచానలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందితే త్వరలో దీనికి సీక్వెల్ 3.0 కూడా చేస్తాను అంటున్నారు శంకర్.

రజనీ ఉంటేనే 3.0 సాధ్యం

రజనీ ఉంటేనే 3.0 సాధ్యం

2.0 ప్రమోషన్లో భాగంగా ముంబైలో మీడియాతో ఇంటరాక్ట్ అయిన శంకర్‌కు దీనికి సీక్వెల్ చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్న ఎదురైంది. ఆయన స్పందిస్తూ.. ‘3.0 చిత్రాన్ని తప్పకుండా చేస్తాను. కానీ రాజనీకాంత్ లేకుండా మాత్రం సాధ్యం కాదు. రోబో చిట్టి పాత్రలో రజనీకాంత్‌ స్థానంలో ఎవరినీ ఊహించలేము' అన్నారు.

ఇప్పడు దానికి గురించి ఆలోచన లేదు

ఇప్పడు దానికి గురించి ఆలోచన లేదు

ప్రస్తుతానికి 3.0 గురించి ఆలోచన చేయలేదు. అందుకు తగిన స్టోరీలైన్, కన్విన్సింగ్ స్క్రిప్టు సిద్ధమైతే తప్పకుండా 3.0 చేస్తాను. ఇండియన్ సినీ ప్రేక్షకులను చిట్టి రోబో ఎంతగానో అలరించింది అని శంకర్ వ్యాఖ్యానించారు.

పెద్ద డైరెక్టర్ పిల్లల సినిమా తీస్తే.. కుర్ర డైరెక్టర్ అడల్ట్ మూవీతో.. 2.0, శంకర్‌పై వర్మ సెటైర్

సూపర్ హీరోల మాదిరిగా సీక్వెల్స్ సాధ్యమే

సూపర్ హీరోల మాదిరిగా సీక్వెల్స్ సాధ్యమే

సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ తరహాలోనే ఇండియన్ సినిమాలో ‘రోబో' సీక్వెల్స్ సాధ్యమే అని దర్శకుడు శంకర్ తెలిపారు. అయితే ప్రస్తుతం తన ఆలోచన అంతా 2.0 రిలీజ్ మీదనే ఉందని, సీక్వెల్స్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదని తెలిపారు.

10 వేల థియేటర్లలో రిలీజ్

10 వేల థియేటర్లలో రిలీజ్

2.0 చిత్రం నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 10వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో దాదాపు 1500 ఐమాక్స్ స్క్రీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క ఇండియాలోనే 7 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నారట.

సరికొత్త అనుభూతి ఖాయం

సరికొత్త అనుభూతి ఖాయం

ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డానికి 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ టేకింగ్‌, 4డీ సౌండింగ్ అనే కొత్త అనుభవాన్ని ప్రేక్ష‌కులు ఫీల్ అవుతారని చిత్ర బృందం చెబుతోంది.

English summary
3.0 will happen when I get the right thought and convincing script. I wish to entertain the audience through Chitti which is loved by all the sections of audience. Like Superman, Batman and Spiderman, I wanted the franchise of Robo in the country” Director Shankar hinted about sequel.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more