»   » కథ సిద్దమవుతోంది... పవర్ స్టార్ జాబితాలో నాలుగో సినిమా ఇదే

కథ సిద్దమవుతోంది... పవర్ స్టార్ జాబితాలో నాలుగో సినిమా ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకేసారి మూడు సినిమాలను ఓకే చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ప్రస్తుతం 'కాటమరాయుడు' షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లోని సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్న పవర్ స్టార్... అది పూర్తయిన తరువాత తమిళ సూపర్ హిట్ 'వేదాలం' రీమేక్‌లో నటించబోతున్నాడు. దర్శకుడు నీసన్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ మూడు సినిమాలకు తోడు పవన్ కళ్యాణ్ మరో సినిమాను ఓకే చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ్ స్టార్ అజిత్ ని ఫాలో అయిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ చేస్తోన్న రెండు చిత్రాలు కూడా అజిత్ సినిమా రిమేక్ లే కావడం విశేషం. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కాటమరాయుడు'.. అజిత్ 'వీరం'కి రిమేక్ అని చెబుతున్నారు. ఇక, ఏ.ఎం రత్నం నిర్మానంలో నీసన్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అజిత్ 'వేదాళం'కి రిమేక్. అజిత్ వీరం, అదాళం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివ.

Director siva planing a film with Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీని తయారు చేస్తున్నాడట. తెలుగులో గోపీచంద్ హీరోగా రెండు సినిమాలు చేసిన శివ... రవితేజ హీరోగా దరువు సినిమా తెరకెక్కించాడు. ఆ తరువాత ఎక్కువగా కోలీవుడ్‌పై ఫోకస్ చేసిన శివ... అజిత్ హీరోగా 'వీరం', 'వేదాలం' వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించి అజిత్‌కు మరో సినిమా హిట్ ఇచ్చేందుకు శ్రమిస్తున్నాడు.

ఈ సినిమా పూర్తయిన తరువాత పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్న శివ... అందుకోసం రెండు మూడు కథలను సిద్ధం చేసుకుంటున్నాడట. వీటిలో ఏ ఒక్క కథ పవన్‌ను మెప్పించినా. పవన్ కొత్త సినిమాల జాబితాలో మరో సినిమా చేరడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఓ పవర్ ఫుల్ కథని రెడీ చేసి పవన్ తో ఓకే చేయించుకోవాలని శివ ఆశపడుతున్నాడు. ఒకవేళ శివ కథని పవన్ ఓకే చేస్తే.. కాటమరాయుడు, త్రివిక్రమ్ సినిమా, నీసన్ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేసిన తర్వాత.. పవన్ శివతో సినిమా చేసే అవకాశం ఉంది. మరీ.. అంతకంటే ముందు శివ కథని పవన్ ఓకే చేస్తాడా.. ? అయితే పవన్‌తో శివ సినిమా ఉంటుందా ఉండదా అనేది అజిత్ మూవీ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందనే టాక్ కూడా లేకపోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో.

English summary
Tamil Director siva who gave super hits for Ajit is planing a film with PowersTar Pawan Kalyan
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu