»   » అల్లు అర్జున్ అలా ఆటపట్టిస్తాడు.. సుకుమార్..

అల్లు అర్జున్ అలా ఆటపట్టిస్తాడు.. సుకుమార్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మధ్య అనుబంధం ఆర్యతో ప్రారంభమైంది. ఆర్య2తో మరింత బలపడింది. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వారి మధ్య స్నేహం మరింత బలపడింది.
తమ మధ్య ఉన్న చనువుతో తనను బన్నీ ఆటపట్టిస్తున్నారనే ఆసక్తికరమైన విషయాన్ని దర్శకుడు సుకుమార్ ఇటీవల వెల్లడించారు. నన్ను మట్టుపర్రోడా అని బన్నీ ఆటపట్టిస్తుంటారని చెప్పారు. మట్టపర్రోడా అని ఎందుకు ఆటపట్టుస్తున్నారనడానికి కారణాన్ని సుకుమార్ వివరించారు.

మా సొంతూరు మట్టపర్రు. అత్యంత మారుమూల గ్రామం అది. అక్కడికి వెళ్లడానికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. ఇప్పటికీ అక్కడికి బస్సులు వెళ్లడానికి రోడ్డు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఓ సారి అల్లు అర్జున్‌ని మా ఊరికి తీసుకెళ్లా. ఇలాంటి ఊరి నుంచి వచ్చిన నువ్వు, అంత పెద్ద సినిమాలు తీస్తున్నావా అని అక్కడి పరిస్థితిని చూసిన బన్నీ ఆశ్చర్యానికి గురయ్యాడు.


Director Sukumar: Allu Arjun teases me in that way

పాతికేళ్ల పాటు నేను నా సొంత ఊర్లోనే ఉన్నా. ఆ మట్టిలో పుట్టాను. మట్టిలోనే పెరిగాను. ఆ వాసనలు, ఆ అలవాట్లు నాలో ఇంకా పోలేదు. అందుకే అప్పుడప్పుడు నన్ను బన్నీ 'మట్టుపర్రోడా' అని ఆటపట్టిస్తుంటారు అని సుకుమార్ వెల్లడించారు.


English summary
Allu Arjun, Sukumar has good bonding between them. Their travel started with Arya movie. Recently sukumar shares his relation with Allu Arjun. He said that allu Arjun teases me as Mattu Parroda. He revealed that Mattu Parru is my native place.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu