అందుకే నిర్మాతగా మారుతున్నా : సుకుమార్
వైవీఎస్ చౌదరి, పూరీ జగన్నాథ్, చంద్రసిద్ధార్థ్.. ఇలా వీరంతా దర్శకత్వం నుంచి సినీ నిర్మాణరంగం వైపు అడుగుపెట్టినవాళ్లే. ఇప్పుడు వీరి సరసన చేరారు సుకుమార్. సుకుమార్ ఎంటర్‌టైన్మెంట్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ... ''నా ప్రొడక్షన్ లో వచ్చే సినిమాల ద్వారా సరికొత్త కథాంశాల్ని అందించాలన్నదే నా కోరిక. ఈ సంస్థ ద్వారా నా దగ్గర పని చేసిన సహాయ దర్శకుల్ని ప్రోత్సహిస్తూ సినిమాలు తెరకెక్కించాలనుకుంటున్నాను. ''అని సుకుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈయన మహేష్‌బాబుతో '1' సినిమాని తెరకెక్కిస్తున్నారు.
నిర్మాతలైన దర్శకుల జాబితాతోకి కొత్తగా చేరిన పేరు సుకుమార్. 'ఆర్య', 'జగడం', 'ఆర్య-2', '100 పర్సెంట్ లవ్' చిత్రాలతో సృజనాత్మక దర్శకునిగా పేరు సంపాదించుకున్న సుకుమార్ ప్రస్తుతం మహేశ్ హీరోగా '1.. నేనొక్కడినే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకునిగా కొనసాగుతూనే తన దగ్గర సహాయ దర్శకులుగా ఉన్న యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించాలనే అభిప్రాయంతో సుకుమార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సంస్థను నెలకొల్పి విభిన్న చిత్రాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు.


Click it and Unblock the Notifications












