»   » నిర్మాతగా మారిన దర్శకుడు సుకుమార్

నిర్మాతగా మారిన దర్శకుడు సుకుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sukumar
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు సుకుమార్ ...నిర్మాతగా మారుతున్నారు. ఆయన సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు..సుకుమార్ ఎంటర్టైన్మెంట్ ప్రెవేట్ లిమెటెడ్. ఈ ప్రొడక్షన్ హౌస్ పై ఆయన డైరక్ట్ చేయరని తెలుస్తోంది. ఆయన అసోసియేట్స్ కోసం ఈ బ్యానర్ పెట్టినట్లు సమాచారం. ఈ బ్యానర్ పై మొదటి సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ కు వెళుతుంది. ప్రస్తుతం సుకుమార్ ..నేనొక్కడే చిత్రం బిజీలో ఉన్నారు.

యూరప్ లో పెద్ద షెడ్యూల్ పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ బ్యాంకాక్ లో జరపటానికి మహేష్ ..నేనొక్కడినే టీమ్ రెడీ అవుతోంది. అక్కడ చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు తీస్తాడని తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే సన్నివేశాలని, వాటిపైనే ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుందని చెప్పుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు. దీని తర్వాత ఫైట్ సీన్ల కోసం బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Sukumar, one of the leading directors of Tollywood, is turning producer. He has started a new banner - Sukumar Entertainment Private Ltd. Interestingly, he won't be directing for this production house. Instead, he will produce films introducing his associates as directors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu