For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒకేరోజు ఇద్దరు టాప్ డైరెక్టర్లకు యాక్సిడెంట్.. ఒకరు ఆస్పత్రి బెడ్ పై, మరొకరు గాయంతో సెట్ లో!

  |

  మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాలను అందించిన దర్శకులలో సురేందర్ రెడ్డి ఒకరు. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా.. స్టైలిష్ డైరెక్టర్ గా సూపర్ పాపులర్ అయ్యారు. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి తర్వాత రవితేజతో ప్రేక్షకులకు సూపర్ 'కిక్' ఇచ్చారు. ఇప్పుడు అఖిల్ అక్కినేనితో ఏజెంట్ తెరకెక్కిస్తున్న ఆయనకు ప్రమాదం జరిగింది. అలాగే బాలీవుడ్ చిత్రసీమలో యాక్షన్ చిత్రాలకు, కామెడీ సినిమాలకు పెట్టింది పేరైన మరో డైరెక్టర్ రోహిత్ శెట్టి కూడా ప్రమాదానికి గురయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  రవితేజ కిక్ సినిమాతో..

  రవితేజ కిక్ సినిమాతో..

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సురేందర్ రెడ్డి. 2005లో నందమూరి కల్యాణ్ రామ్ అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమా ప్రేక్షకులను పరిచయం అయిన సురేందర్ రెడ్డి యాక్షన్ మూవీస్ కు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతనొక్కడే తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అశోక్, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో అతిథి ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీస్ తెరకెక్కించిన ఆయన మాస్ మహారాజ రవితేజ కిక్ రూపొందించి సరికొత్త కామెడీ అందించారు. 2009లో వచ్చిన కిక్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  కాలికి గాయమైనప్పటికీ..

  కిక్ తర్వాత ఊసరవెల్లి, రేసు గుర్రం, కిక్ 2, ధ్రువ, సైరా నరసింహా రెడ్డి వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు అక్కినేని అఖిల్ తో ఏజెంట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కూడా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం సురేందర్ రెడ్డి చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే యాక్షన్స్ వివరించే క్రమంలో సురేందర్ రెడ్డి గాయపడ్డారట. ఆయన కాలికి తీవ్ర గాయమైనప్పటికీ మళ్లీ వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారని మేకర్స్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

  ఆయన చూపే శ్రద్ధకు..

  "ఉదయం సెట్ లో ప్రమాదంలో గాయపడిన మా డైరెక్టర్ సురేందర్ ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చి మరి ఏజెంట్ సినిమా షూటంగ్ లో పాల్గొన్నారు. ఒక మంచి సినిమాను అందించేందుకు ఆయన చూపే శ్రద్ధకు మంత్రముగ్ధుడిని అయ్యాను" అని మేకర్స్ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డిలానే మరో టాప్ డైరెక్టర్ గాయపడ్డారు. యాక్షన్ అండ్ కామెడీ చిత్రాలకు పేరుగాంచిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి గాయాలపాలయ్యారు.

  హైదరాబాద్ లో ప్రమాదం..

  హైదరాబాద్ లో ప్రమాదం..

  హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు రోహిత్ శెట్టి. ఈ సినిమాలో భాగంగా కారు చేజింగ్ సీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడ్డారు దర్శకుడు రోహిత్ శెట్టి. దీంతో ఆయన్ను హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే రోహిత్ శెట్టి.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు సంబంధించిన ఒక షెడ్యూల్ ను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

   రీమెక్స్ చిత్రాలతో..

  రీమెక్స్ చిత్రాలతో..

  ఇక డైరెక్టర్ రోహిత్ శెట్టికి సౌత్ లో కూడా ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఆయన హిందీలో చిత్రాలు తెరకెక్కించినప్పటికి అందులో సౌత్ ఫ్లేవర్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన ఎక్కువగా.. తెలుగు, తమిళ హిట్ సినిమాలను రీమెక్స్ చేస్తుంటారు. ఆయన తీసిన సినిమాల్లో సింగం, సింగం 2, సింబా, చెన్నై ఎక్స్ ప్రెస్, సూర్య వంశీ, గోల్ మాల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అయితే ఇటీవల రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డేలతో తీసిన సర్కస్ మూవీ మాత్రం డిజాస్టర్ టాక్ అందుకుంది.

  English summary
  Tollywood Director Surender Reddy And Bollywood Director Rohit Shetty Got Accident While Movie Action Scenes Shooting
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X