»   » బాలయ్య ‘ఎన్టీఆర్ బయోపిక్’.... రంగంలోకి దర్శకుడు తేజ!

బాలయ్య ‘ఎన్టీఆర్ బయోపిక్’.... రంగంలోకి దర్శకుడు తేజ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
"I am Quite Nervous When Asked To Direct The Biopic" Director Teja Says

నందమూరి బాలకృష్ణ త్వరలో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు జీవితంపై సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ సినిమాకు సంబంధించి దర్శకుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై కసరత్తు చేస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను తానే పోషించబోతున్నట్లు బాలయ్య ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బాలయ్య, దర్శకుడు తేజ కలిసి ఈ ప్రాజెక్టు గురించి చర్చించడంతో ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారనే విషయం ప్రచారంలోకి వచ్చింది. దీనిపై తేజ స్పందించారు.

 దర్శకుడు తేజ స్పందన

దర్శకుడు తేజ స్పందన

తాను బాలయ్యను కలిసింది నిజమే అని, ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్టు గురించి బాలకృష్ణ ఓ నాలుగైదు సార్లు తనని పిలిచి మాట్లాడారని ఆయన ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

 చాన్స్ ఉంది, ఇంకా ఫైనల్ కాలేదు

చాన్స్ ఉంది, ఇంకా ఫైనల్ కాలేదు

తాను ఎన్టీఆర్ కి వీరాభిమాని, అయన చరిత్రను తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. తానే ఈ ప్రాజెక్టును డీల్ చేస్తానా? లేదా? అనే విషయం ఇంకా తుది నిర్ణయానికి రాలేదని... ఆ ఛాన్స్ అయితే ఉందని, నేను ఈ ప్రాజెక్టుకు పూర్తి న్యాయం చేస్తానని అనిపిస్తేనే చేస్తాను అని దర్శకుడు తేజ తెలిపారు.

ఇంప్రెస్ అయిన బాలయ్య

ఇంప్రెస్ అయిన బాలయ్య

తేజ దర్శకత్వంలో ఇటీవల రాజకీయాల నేపథ్యంలో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' చూసిన బాలయ్య ఇంప్రెస్ అయ్యాడని, అందుకే దర్శకుడు తేజను పలిపించి మాట్లాడారని, త్వరలోనే ఆయన్ను దర్శకుడిగా ఖరారు చేస్తూ ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్.

 తాతయ్య బయోపిక్‌లో నటించను: జూ ఎన్టీఆర్

తాతయ్య బయోపిక్‌లో నటించను: జూ ఎన్టీఆర్

తాతయ్య జీవిత కథతో వచ్చే సినిమాలో తాను నటించడానికి సిద్ధంగా లేనని జూ ఎన్టీఆర్ తేల్చి చెప్పారు. అంత ధైర్యం త‌న‌కు లేద‌ని జూనియర్ వ్యాఖ్యానించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 వివాదాస్పదంగా వర్మ ఎన్టీఆర్ బయోపిక్... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫస్ట్ లుక్ ఇదే

వివాదాస్పదంగా వర్మ ఎన్టీఆర్ బయోపిక్... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫస్ట్ లుక్ ఇదే

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంపై రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
"I am quite nervous when asked to direct the biopic. It is too early to reveal about this and I am a huge fan of the legendary actor of Tollywood. Presenting the biopic on screen is not an easy job and I will sign the project if I feel I can do complete justice for the project" revealed Teja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu