»   » డైరక్టర్ తేజ 'స్టార్ హంట్' డిటేల్స్

డైరక్టర్ తేజ 'స్టార్ హంట్' డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరక్టర్ తేజ మళ్లీ తన కొత్త చిత్రం గురించి స్టార్ హంట్ మొదలెట్టారు. రేడియో మిర్చి,భవ్య సిమెంట్స్ సహకారంతో ఈ హంట్ కొనసాగుతుంది.ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ ''నేను సినిమా తీసి మూడు సంవత్సరాలైంది. ఉత్కంఠభరితంగా సాగే ప్రేమ కథా చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ఈ చిత్రంలో మొత్తం 32 పాత్రలుంటాయి. నలుగురు మినహా అందరూ కొత్తవారే ఉంటారు. 16-20 వయసుండి, నటనపై ఆసక్తి ఉన్న ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 15తో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సెప్టెంబరు తొలి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తామని అన్నారు.ఇక ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ హంట్ లో పాల్గొనాలంటే.. www.radiomirchi.com/hyderabad కి లాగ్ ఆన్ అయ్యి అప్లికేషన్ పంపించాలి. లేదా మీ దగ్గరలోని భవ్య సిమెంట్ డీలర్ ని సంప్రదించినా అక్కడ అప్లికేషన్ దొరుకుతుంది. ఇక కొన్ని డైరక్ట్ ఆడిషన్స్ వైజాగ్,హైదరాబాద్, విజయవాడ కాలేజీలలో జరుపుతారు.ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకోదలిచిన వారు..5558811 ఫోన్ చేయవచ్చు.

English summary
Teja, who introduced several stars including Uday Kiran, Nitin and Reema Sen, has announced that his next film will also have newcomers in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu