»   » ఉదయ్ కిరణ్ బయోపిక్ విషయంలో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు తేజ!

ఉదయ్ కిరణ్ బయోపిక్ విషయంలో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు తేజ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Actor Uday Kiran Biopic : Director Teja Gives Clarification

'ఎన్టీఆర్ బయోపిక్' అఫీషియల్‌గా లాంచ్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నుండి దర్శకుడు తేజ తప్పుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. బాలయ్యతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీని తర్వాత తేజ పేరు మరో అంశంతో వార్తల్లోకి ఎక్కింది. ఆయన ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయబోతున్నారని, ఈ సినిమా కోసం 'కాబోయిన అల్లుడు' టైటిల్ రిజిస్టర్ చేయించారని, ఇందులో ఉదయ్ కిరణ్ గురించి జనాలకు తెలియని ఎన్నో విషయాలు చూపించబోతున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై తేజ స్పందించారు.

ఉదయ్ కిరణ్ బయోపిక్ అబద్దం, అంతా ఫేక్

ఉదయ్ కిరణ్ బయోపిక్ అబద్దం, అంతా ఫేక్

ఉదయ్ కిరణ్ బయోపిక్ నేను తీస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇందంతా ఫేక్ న్యూస్ అని తేజ స్పష్టం చేశారు. ఈ రూమర్స్ ఎలా ప్రచారంలోకి వచ్చాయో తనకు తెలియదని, విన్న వెంటనే తానూ షాకయ్యాను అని.... ఓ ఆంగ్లపత్రికతో తేజ వ్యాఖ్యానించారు.

యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్న తేజ

యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్న తేజ

త్వరలో తాను యాక్షన్ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నానని, ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నట్లు తేజ తెలిపారు. దీంతో పాటు రానాతో కూడా మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. రానాతో చేయబోయే మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి' చిత్రాన్నికి భిన్నంగా ఉంటుందని, పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా తీయబోతున్నట్లు తెలిపారు.

అందుకే ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ తప్పుకున్నాడా?

అందుకే ఎన్టీఆర్ బయోపిక్ నుండి తేజ తప్పుకున్నాడా?

ఎన్టీఆర్ బయోపిక్ నుండి ఎందుకు తప్పుకున్నారనే విషయమై తేజ స్పందించలేదు. ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూపించడం మామూలు విషయం కాదు, ఎన్నో సవాళ్లతో కూడుకున్న అంశం, దీన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ తనకు లేకని చివరి నమిషంలో రియలైజ్ అయిన ఆయన తనకు తానుగా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అసలు కారణం బాలయ్యతో విబేధాలే అని ఆయన సన్నిహితులంటున్నారు.

ఉదయ్ కిరణ్ బయోపిక్ రూమర్స్

ఉదయ్ కిరణ్ బయోపిక్ రూమర్స్

తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం' మూవీ ద్వారా ఉదయ్ కిరణ్ హీరోగా కెరీర్ మొదలు పెట్టారు. ఈ సినిమా తర్వాత వరుస హిట్లు కొడుతూ తూసుకెళ్లారు. అయితే ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది. 2014లో ఎవరూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ గురించి బాగా తెలిసిన వ్యక్తుల్లో తేజ ఒకరు. ఆ కారణంగానే తేజకు లింకు పెడుతూ ఉదయ్ కిరణ్ బయోపిక్ రూమర్స్ తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఆయన క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్లకు తెరపడింది.

English summary
“It’s all fake news! I am not doing any film based on Uday Kiran’s life. I don’t know who started this rumour, but I have never planned any film like that. My next will be an action film,” director Teja said about Uday Kiran Biopic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X