»   » ఫిదా: అమ్మ నటనపై పెళ్లి చూపులు డైరెక్టర్ ఇలా...

ఫిదా: అమ్మ నటనపై పెళ్లి చూపులు డైరెక్టర్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన'ఫిదా' చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. శేఖర్ కమ్ములతో పాటు, వరుణ్ తేజ్ కెరీర్లో ఇదే అతిపెద్ద హిట్ అని తేలిపోయింది. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ఏలో 1 మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి వసూళ్లు ఏ రేంజిలో ఉంటాయో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

కాగా....ఈ మూవీలో హీరోయిన్ సాయిపల్లవి అత్తమ్మ పాత్ర పోషించిన గీతా భాస్కర్ చర్చనీయాంశం అయింది. ఆమె మరెవరో కాదు.... కొన్ని రోజుల క్రితం వచ్చిన 'పెళ్లి చూపులు' మూవీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి.


అప్పుడే చెప్పిన శేఖర్ కమ్ముల

అప్పుడే చెప్పిన శేఖర్ కమ్ముల

ఫిదా సినిమా విడుదల ముందే.... శేఖర్ కమ్ముల గీతా భాస్కర్ గురించి ఓ మాట అన్నారు. ‘ఫిదా' సినిమా ముందు ఆమెను తరుణ్ భాస్కర్ తల్లి అంటున్నారు. సినిమా విడుదల తర్వాత తరుణ్ భాస్కర్ గీతా భాస్కర్ కొడుకు అనే పరిస్థితి వస్తుందని వెల్లడించారు. ఇపుడు అదే మాట నిజం అయ్యేలా ఉంది.


CM KCR appreciates Fidaa Movie Cast and Crew
తల్లి గురించి తరుణ్ భాస్కర్

తల్లి గురించి తరుణ్ భాస్కర్

ఫిదాలో తన తల్లి గీతా భాస్కర్ మంచి పాత్రలో కనిపించి గొప్పగా నటించిందని కితాబిచ్చారు తరుణ్‌ భాస్కర్. తన తల్లికి నటిగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ నేచురల్ గా నటించిందని తరుణ్ భాస్కర్ తెలిపారు.


మరిన్ని అవకాశాలు

మరిన్ని అవకాశాలు

ఫిదా సినిమా తర్వాత గీతా భాస్కర్‌కు నటిగా మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గీత భాస్కర్ మరిన్ని సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నారా? లేరా? అనేది తెలియాల్సి ఉంది.


దిల్ రాజుకు భారీ లాభాలు

దిల్ రాజుకు భారీ లాభాలు

ఫిదా సినిమాతో దిల్ రాజుకు భారీ లాభాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు రూ. 15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించినట్లు సమాచారం. సినిమా ఓవరాల్ రన్ లో ఆయనకు రెట్టింపు లాభాలు ఖాయం అంటున్నారు.English summary
'Pelli Choopulu' director Tharun Bhascker's mother Geeta Bhaskar made her silver screen debut with Fidaa. Geetha played the role of Sai Pallavi's aunt in Fidaa. Despite Fidaa was her first feature film, she had an inexplicable ease at acting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu