For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కర్ర పుచ్చుకుని థియేటర్ నుంచి తరిమేసాడు: వంశీ పైడిపల్లి

  By Srikanya
  |

  హైదరాబాద్ : హైదరాబాద్ సుదర్శన్ 35 ఎం.ఎం. థియేటర్ లో నన్ను పెద్ద కర్ర పట్టుకుని బయటకు సాగనంపారు అంటున్నారు వంశీ పైడిపల్లి. ప్రభాస్ 'మున్నా' చిత్రంతో దర్శకుడు అయ్యిన వంశీ పైడిపల్లి రిజల్ట్ తో సంభంధం లేకుండా తన టేకింగ్ తో పెద్ద డైరక్టర్ అయ్యి పోయారు. ఆ తర్వాత జూ. ఎన్.టి.ఆర్. 'బృందావనం' హిట్ తో తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు రామ్‌చరణ్ 'ఎవడు?' తో మనముందుకు దూసుకు రాబోతున్నారు. ఆయన తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విషయం తెలియచేసారు.

  ఆయన మాటల్లో...ఒకసారి సుదర్శన్ 35 ఎం.ఎం.లో 'ప్రేమికుడు' సినిమాకి 20 మందిని వెంటేసుకుని వెళ్లాను. అప్పటికే ఆ సినిమా చూడ్డం నాలుగో సారనుకుంటా. సినిమా మొదలైంది. మొదటి పాట మొదలవగానే 20 మందిమి ఒకేసారి లేచి నిలబడి పేపర్ కటింగ్స్‌ని పైకి విరజిమ్మి, విజిల్స్ వేస్తూ, డాన్స్‌లు మొదలెట్టాం. మొదట్లో ఏదో కుర్రకారు అభిమానం అనుకున్నారుగానీ, ప్రతి పాటకీ లేచిపోతుంటే ఇక ఓపిక సన్నగిల్లి, కోపంతో వెళ్లి సినిమా మేనేజర్ 'మక్సూద్'ని వెంటబెట్టుకుని వచ్చారు. ఆయన రావడం రావడంతోనే పెద్ద కర్రపుచ్చుకుని వచ్చి మమ్మల్నందర్నీ హాల్ బయటకి తరిమేశాడు అన్నారు.

  అయితే అదే సుదర్శన్ 35 ఎం.ఎం.లో నా 'బృందావనం' సినిమా విడుదలైనప్పుడు, అదే మేనేజర్ మక్సూద్ కనిపించాడు. 'ప్రేమికుడు' సినిమాలో తను కర్రతో మమ్మల్ని వెళ్లగొట్టిన సంఘటన గుర్తుచేస్తే 'అప్పుడది నా డ్యూటీ కదా సార్' అన్నాడు నవ్వుతూ అని చెప్పారు. ఇక అప్పట్లో వచ్చిన ప్రేమదేశం, ప్రేమికుడు సినిమాలంటే పడి చచ్చేవాళ్లం. ఈ రెండు సినిమాలు కుర్రకారుని ఎట్లా అల్లల్లాడించాయో మీకు తెలియంది కాదు. కాని మా దరిదాపుల్లో ఉన్న హాల్స్‌లో ఆ సినిమాలు ఆడుతున్నా చూసేవాళ్లం కాదు - క్రాస్‌రోడ్స్ వెళ్లి సంధ్య, సుదర్శన్, ఓడియన్ లాంటి వాటిల్లో చూస్తేనే సినిమా చూసినట్టు ఉండేది మాకు. నేను టికెట్స్ తీస్తానని చెప్పి, మిగతా వారిని న్యూస్‌పేపర్స్ కటింగ్స్ తీసుకురమ్మని ఒప్పందం చేసుకునేవాడ్ని. పాట మొదలవగానే కాగితం ముక్కల్ని పైకి విసిరేయడంలో గొప్ప ఆనందం ఉండేది మరి అన్నారు.

  ప్రస్తుతం వంశీ పైడిపల్లి తన తాజా చిత్రం 'ఎవడు?' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా చేస్తోంది. సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ సరసన కాజల్ గెస్ట్ గా రీసెంట్ గా ఎంపిక చేసారు. ఈ విషయమై వంశీ మాట్లాడుతూ.. అవును.. కాజల్ మా ఎవడు చిత్రంలో గెస్ట్ పాత్ర చేస్తోంది. ఆమె అల్లు అర్జున్ పాత్రకు పెయిర్ గా కనిపించనుంది అన్నారు.

  English summary
  Vamsy Paidipally says..."My film journey is almost like a ‘Cinema Paradise’ because just 3months before of my birth, my Dad bought a theatre in Thanapur in the district of Adilabad, where I think I had always synod of cinemas then itself because theatre was some thing very close to my heart and I have grown up in Cinema atmosphere. I spent my most of the holidays in that theatre and I think there itself my passion started."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X