twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Needhi Naadhi Oka Kadhaకి నాలుగేళ్లు.. ఎమోషనల్ అయిన దర్శకుడు వేణు ఊడుగుల

    |

    శ్రీ విష్ణు హీరో గా నటించిన 'నీది నాది ఒకే కథ' చిత్రం విడుదలై 4 ఏళ్లు పూర్తయింది. మార్చ్ 23 2018 సంవత్సరంలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన 'బిచ్చగాడు' ఫేమ్ సాట్నా టైటస్ జతగా కనిపించి కనువిందు చేశారు. ప్రశాంతి, కృష్ణ విజయ్ మరియు అట్లూరి నారాయణ రావు అరాన్ మీడియా వర్క్స్ మరియు శ్రీ వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా దర్శకుడు వేణు ఊడుగుల ఒక ఎమోషనల్ నోట్ పంచుకున్నారు.

    నీది నాది ఒకే కధకు 4 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. నిరంతరం సపోర్ట్ చేస్తున్న శ్రీవిష్ణు, రోహిత్ నారా, కృష్ణ విజయ్‌ఎల్ & ప్రేక్షకులకు ధన్యవాదాలు. విరాటపర్వం అనే మరో గొప్ప చిత్రం మీకు అందించడం కోసం నేను వేచి ఉండలేను. ఇది భావోద్వేగాల యొక్క సున్నితమైన సూక్ష్మ నైపుణ్యాల కలయిక & త్వరలో ఒక గొప్ప చిత్రం రాబోతుందని నేను హామీ ఇస్తున్నాను అంటూ వేణు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఒక రకంగా ఈ సినిమా ప్రస్తుత విద్యా వ్యవస్థ మీద ఎక్కుపెట్టిన బాణం అనే చెప్పాలి.

    director Venu udugula shares an emotional note over Needhi Naadhi Oka Kadha

    ఎందుకంటే ప్రస్తుత విద్యావ్యవస్థలో ర్యాంకులు, మార్కులే విజ్ఞానానికి ప్రామాణికంగా మారాయి. అందుకోసం విద్యార్థులను రోబోట్ లుగా మార్చి వేస్తూ విద్యార్థి అభిరుచి ఏంటో కూడా తెలుసుకోకుండా.. తల్లిదండ్రులు తమ పరువు ప్రతిష్ఠల కోసం వారిపై తమ సొంత అభిప్రాయాలను రుద్దుతున్నారు. జీవితమంటే కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య అనే స్థాయికి తల్లిదండ్రులే పిల్లల మనసుల్లోకి చొప్పిస్తున్నారు. ఇలాంటి దురభిప్రాయం వలన విద్యార్థులు జీవితాలను బలిదానం చేసే పరిస్థితులు నిత్యం మనం అనేక వార్తాపత్రికలలో మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా దానిని ఒక వార్తగా చూసి మళ్ళీ పిల్లల మీద మన అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాం.

    విద్యావ్యవస్థల లోపాలు, పిల్లలపై తల్లిదండ్రుల ఒత్తిడి లాంటి ఓ సున్నితమైన పాయింట్‌ను అందుకొని రూపొందించిన సినిమానే నీది నాది ఒకే కథ. ర్యాంకులు, మార్కులు రేసులో పరుగెత్తలేని ప్రతీ సగటు విద్యార్థి కథే ఈ సినిమా కథ. అందరూ ఇది నా కదా అని భావించే విధంగా ఉండటంతోనే ఈ సినిమాకు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడు వేణు ప్రస్తుతం రానా, సాయి పల్లవి కాంబినేషన్లో విరాటపర్వం అనే సినిమా చేస్తున్నాడు. మావోయిస్టు నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు కూడా ఇదే విషయాన్ని కన్ఫామ్ చేశాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది.

    English summary
    Director Venu udugula shares an emotional note over Needhi Naadhi Oka Kadha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X