»   » చాలా క్యూట్‌గా ఉంది: వరుణ్ తేజ్-పూరి మూవీ హీరోయిన్ ఈమేనా?

చాలా క్యూట్‌గా ఉంది: వరుణ్ తేజ్-పూరి మూవీ హీరోయిన్ ఈమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. వాస్తవానికి ఈ చిత్రం నితిన్ తో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల నితిన్ ప్లేసులోకి వరుణ్ తేజ్ వచ్చాడు.

కాగా... ఈ చిత్రంలో హీరోయిన్ ఖరారైనట్లు తెలుస్తోంది. మాజీ మిస్ ఇండియా రన్నరప్ దిశా పతానిని వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అఫీషియల్ సమాచారం మాత్రం ఇంకా రాలేదు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

ఈ చిత్రం గురించి సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతన సి.కళ్యాణ్ మాట్లాడుతూ....‘‘చంద్రకళ నుంచి జ్యోతిలక్ష్మీ వరకు మా బేనర్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. తాజాగా మా బేనర్‌లో వరుణ్ తేజ్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పూరిగారు ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన సబ్జెక్ట్‌ని చేశారు. ఈ చిత్రాన్ని జూన్ నెలలోనే ప్రారంభిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అన్నారు.

Disha Patani confirmed for Puri Jagan-Varun Tej’s film?

కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని నితిన్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కాస్త ఘాటుగానే పూరి స్పందించారని ఆయన తాజా ట్వీట్ చూస్తే అర్దమవుతుంది.

పూరీ ట్వీట్ చేస్తూ..." నేను నితిన్ తో చేద్దామనుకున్న ప్రాజెక్టుని వేరే హీరోతో చేస్తున్నాను. అదే రోజున షూటింగ్ ప్రారంభమవుతుంది..మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తాను " అన్నారు. అదే రోజున వేరే హీరోతో ఇదే కథతో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తానని పూరి వెంటనే అనటం అంతటా చర్చనీయాంశంగా మారింది.

గతంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేసానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది.' అని అన్నాడు. మరి ఈ లోగా ఏం తేడాలో వచ్చాయో ఏంటో ఇలా కాన్సిల్ అయ్యింది ఈ ప్రాజెక్టు.

English summary
Puri Jagannadh and Mega hero Varun Tej is teaming up for an untitled film. buzz is to be believed, the actress for this film was confirmed. She is none other than the former Miss India Runner-Up Disha Patani.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu