»   » మేకప్ ఇష్టం లేదు సరే..! బట్టలు కూడానా..??: ఏందీ బీభత్సం దిశాపటానీ

మేకప్ ఇష్టం లేదు సరే..! బట్టలు కూడానా..??: ఏందీ బీభత్సం దిశాపటానీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ నటుడు జాకీచాన్‌కు డాన్సు నేర్పిన హీరోయిన్‌గా, 'ఎంఎస్ ధోనీ : ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాలో ధోనీ ప్రియురాలిగా చేసిన దిశా పటానీ ఇపుడు సరికొత్త అవతారంలో హల్‌చల్ చేస్తోంది. తెలుగు వెండి తెరకు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో పరిచయమైంది. ఈ చిత్రం అంతమాత్రంగా ఆడింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది.

అలాగని చేతినిండా సినిమాలేవీ లేవు. అవకాశాలు తక్కువే అయినా.. అమ్మడికి క్రేజ్ మాత్రం విపరీతంగా వచ్చేసింది. ఆమె క్రేజ్‌కు కారణం మాత్రం సినిమాలు కాదండోయ్. వీలు చిక్కినప్పుడల్లా దిశా ఇస్తున్న గ్లామర్ ట్రీటే ఇందుకు కారణం. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దిశా.. సినిమాల కన్నా ఫొటో షూట్లతోనే క్రేజ్‌ను తెచ్చేసుకుంది.

Disha Patani goes topless for Dabboo Ratnani calendar

ఫొటో షూట్లనే కాదు.. ఈవెంట్ ఏదైనా సరే వీలైనంత ఎక్స్‌పోజింగ్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కానీ, తన హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో దర్శనిమిస్తూ నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఒక కేలండర్ కోసం టాప్ లెస్ పోజు ఇచ్చింది.

మేకప్ అంటే తనకు అయిష్టం అంటున్న ఈ భామ.. ఇదే సమయంలో అందచందాలను ఈ రకంగా ఆవిష్కరించింది. బాలీవుడ్ స్టార్లు షారూక్, విద్యాబాలన్, ప్రియాంక చోప్రా, అనుష్కా శర్మ, సన్నీ లియోనీలు కూడా ఈ క్యాలెండర్ కోసం పోజులిచ్చారు. వారి సరసన అవకాశం సంపాదించింది దిశా. ఈ కేలండర్ పై బొమ్మలుగా ఉన్న వాళ్లందరి కన్నా.. దిశ గురించినే ఎక్కువమంది మాట్లాడుతున్నారు!

English summary
Disha Patani breaks out from her girl-next-door image as she goes topless for Dabboo Ratnani's annual celebrity calendar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu