For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సోషల్ మీడియా లో దువ్వాడ కథలు , ఇన్నిరకాల లీకుల్లో ఏదినిజం

  |

  హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'దువ్వాడ జగన్నాథం' తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొత్త చిత్రంలో తమ అభిమాన హీరో ఎలా కనిపిస్తాడోనని వేచి చూస్తున్న వారికి అల్లు అర్జున్‌ అదిరిపోయే లుక్‌తో ఎంట్రీ ఇచ్చాడు. దాంతో ఈ చిత్రం ఎన్టీఆర్ సూపర్ హిట్ అదుర్స్ నుంచి ప్రేరణ పొందినట్లు గా ప్రచారం జరిగింది.

  మొదటగా ఈ సినిమా అదుర్స్2 టైపులో ఉంటుందని.. ఆ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన చారి కేరక్టర్ మాదిరిగానే స్టైలిష్ స్టార్ రోల్.. కేరక్టరైజేషన్ ఉంటాయని అన్నారు. ఫస్ట్ లుక్ రివీల్ చేసిన తర్వాత.. అగ్రహారంలో నడిచే కేటరింగ్ సర్వీస్ నడుపుతాడని అర్ధం కావడంతో.. మరో టాక్ బయల్దేరింది. మైకేల్ మదన కామ రాజులో కమల్ హాసన్ చేసిన పాత్రలా బన్నీ రోల్ ఉంటుందని అంటున్నారు. అయితే దువ్వాడ జగన్నాథం స్టోరీ అంటూ ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో రెండు కథలు సర్క్యులేట్ అవుతున్నాయి, అవేమిటంటే...

   చిరంజీవి సూపర్ హిట్ :

  చిరంజీవి సూపర్ హిట్ :

  అయితే.. అసలు విషయం ఏంటంటే.. డీజేలో బన్నీ చేస్తున్న పాత్రలో రెండు రకాల షేడ్స్ ఉంటాయట. కేరక్టర్ ఒకటే అయినా.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్ర ఇది అని తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఈ చిత్రం చిరంజీవి సూపర్ హిట్ ఇంట్లో రామయ్య..వీధిలో కృష్ణయ్య నుంచి స్టోరీ లైన్ తీసుకున్నారు కానీ, కేవలం అదుర్స్ నుంచి పాత్ర మాత్రమే తీసుకుని ముందుకు వెళ్తున్నట్లుగా కూడా చెప్తున్నారు.

   విలన్ గ్యాంగ్ తో:

  విలన్ గ్యాంగ్ తో:


  దువ్వాడ జగన్నాథం అలియాస్ డీజే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. తన అగ్రహారం వదిలి హైదరాబాద్ కు వస్తాడట. ఐతే ఒకానొక టైంలో డీజే విలన్ గ్యాంగ్ తో గొడవపడుతుండగా ఒక పోలీస్ ఉన్నతాధికారరి చూసి, ఒక ముఖ్యమైన పనిని అప్పగిస్తాడట.

   డీజే స్టోరీ:

  డీజే స్టోరీ:


  ఇంతకు ఆ అధికారి అప్పజెప్పిన పని ఏంటి? ఆ తర్వాత డీజే ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కోవలసి వచ్చింది అనేది మిగతా కథ అని గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్న డీజే స్టోరీ. అయితే కథ ఇదో కాదో తెలియదు కాని దువ్వాడ జగన్నాథం అంటూ ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్ సినిమా ఆడియెన్స్ ముందుకు తెస్తున్నట్టే ఉన్నాడు హరీష్ శంకర్ అంటున్నారు.

   ఇదే నిజం స్టోరీ:

  ఇదే నిజం స్టోరీ:


  ఇదిలా ఉంటే ఇదే నిజం స్టోరీ అంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న కథ ఇంకోటి ఇదీ ఊళ్ళో ఉండి డ్యాన్సులు ఇరగదీసే జగన్నాథం. చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకుని ఉంటాడు. టీనేజ్ వయసుకి అన్ని రకాల డ్యాన్సుల్లోనూ ప్రావీణ్యం సంపాదించి ఉంటాడు.

   హీరోయిన్ హెల్ప్ చే్స్తుంది:

  హీరోయిన్ హెల్ప్ చే్స్తుంది:


  డబ్బులు రాని, క్రేజ్ లేని క్లాసికల్ డ్యాన్స్ కాకుండా పబ్‌లలో డ్యాన్సులు ఇరగదీయాలని, దేశంలోనే నంబర్ వన్ డిజె అవ్వాలని హైదరాబాద్ వస్తాడు. అయితే బ్రోకర్లు దెబ్బెయ్యడంతో బజారున పడతాడు. ఆ టైంలోనే ఓ హీరోయిన్ హెల్ప్ చే్స్తుంది. ఫేమస్ డిజె అయిపోతాడు.

   ఎలా ఫేస్ చేశాడు?:

  ఎలా ఫేస్ చేశాడు?:


  అయితే హెల్ప్ చేసిన అమ్మాయి వళ్ళే బన్నీకి ప్రేమ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎలా ఫేస్ చేశాడు? బన్నీ జీవితం ఇంకా ఎన్ని మలుపులు తిరిగింది అనేది దువ్వాడ జగన్నాథం కథ అంటూ ఒక కథ ఇప్పటికైతే సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

  అదుర్స్ సిరీస్

  అదుర్స్ సిరీస్

  రెండు కథలూ బానే ఉన్నాయి మరి వీటిలో ఏది సినిమా ఒరిజినల్ కథా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. ఒక వేళ ఈ కథల్లో ఏదీ కాకుంటే మాత్రం ఇంకో సినిమాకి మాంచి స్టఫ్ దొరికేసినట్టే. అదుర్స్ సిరీస్ అంటూ వరుస సినిమాలనే తీసెయ్యొచ్చు.

   ది బెస్ట్ డ్యాన్సులు:

  ది బెస్ట్ డ్యాన్సులు:

  ఇక డిజెగా బన్నీ డ్యాన్సులను ఏ రేంజ్‌లో ఇరగదీసి ఉంటాడో వేరే చెప్పాలా? ప్రస్తుతం కొరియోగ్రాఫర్స్‌తో కలిసి కూర్చుంటున్నాడట హరీష్. ది బెస్ట్ డ్యాన్సులను డిజైన్ చేయిస్తున్నాడట. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని తెలుగు సినిమాల్లోకి ది బెస్ట్ డ్యాన్స్...ఈ సినిమాలో ఉంటుందట.

  English summary
  Buzz is that DJ Duvvada Jagannadham story has been leaked by some inside culprits of the project and the makers have already started taking necessary measures to control the leaks.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X