For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాజల్ లిప్ లాక్ ఆ సినిమాకి ప్లస్ అయ్యే లాగే ఉంది: ట్రైలర్ లోనే వాడేసారు

  |

  హైవే హీరో రణదీప్ హుడా తో కాజల్ ... "దో లఫ్జోంకీ కహానీ" అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఆ పిక్చర్ లో రణదీప్ హుడా- కాజల్ మధ్య కొన్ని సీన్స్‌‌లో కెమిస్ర్టీ భలేగా కుదిరిందట. అంతే కాదు ఈ మూవీలో హీరోయిన్ కాజల్ లిప్ లాక్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

  కొన్ని రోజులుగా ఆ ముద్దు ముచ్చట సెన్సేషన్ పుట్టిస్తోంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ కూడా చాలా హ్యపీగా ఉంది . ఇక మలేషియాలో జరిగిన షూట్‌లో రణదీప్‌తో కాజల్ ముద్దు సీన్ పోస్టర్ అనుకోకుండా లీకైంది. కాజల్ కూడా దీనిపై ఫైర్ అయిందంటూ వార్తలు కూడా వచ్చాయి.

  Watch Trailer Here

  అయితే ముద్దు సీన్ ఎలాగూ లీకైంది కదా.దాన్ని క్యాష్ చేసుకుందామనుకున్న డైరెక్టర్ దీపక్ ఏం తక్కువ తినలేదు. ఏకంగా ట్రైలర్‌లో ఈ సీన్‌ని రివీల్ చేశాడు. కాకపోతే సినిమాలో మాత్రం ఈ సీన్ ఉండదని కొందరు చెబుతున్నారు. ఈ సీన్ ట్రైలర్ కే పరిమితం అంటున్నారు. ట్రైలర్లో ఉన్నాక సినిమాలో ఉన్నా లేకున్నా ఒకటే కదా.

  "ఆల్‌ ‌వేస్" అనే కొరియన్ మూవీ ఆధారంగా ఆ బాలీవుడ్ సినిమా రాబోతోంది. ఇందులో కాజల్ అంధురాలిగా, హీరో రణ్‌దీప్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపిస్తారు. గుడ్డి పాత్ర లో కాజల్ కనిపించటం ఇదే మొదటి సారి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావడంతో యూనిట్ మొత్తం ఇప్పుడు పిక్చర్ ప్రమోషన్‌ మీదే దృష్టి పెట్టింది. ఇందులోభాగంగా కొత్త ట్రైలర్ రిలీజ్ చేసింది యూనిట్. దీపక్ తిజోరి డైరెక్షన్‌లో రానున్న ఈ చిత్రం ఈనెల 10న విడుదల అవుతుంది.

  ఊక్క సారి కూడా చేయలేదు

  ఊక్క సారి కూడా చేయలేదు

  ఇప్పటివరకూ ఒక్క సారి కూడా ఆన్ స్క్రీన్ పై లిప్ లాక్ సన్నివేశం చేయలేదు. ఎంత పెద్ద సినిమా అయినా ఎంతటి బడా స్టార్ అయినా తన రూల్ ని మాత్రం ఇన్నేళ్లూ బ్రేక్ చేయలేదు కాజల్. కానీ ఈ సినిమాలో లో ముద్దు సీన్ చేయడం సంచలనం అయింది

  ఇష్టం లేకుండా నే చేసిందట

  ఇష్టం లేకుండా నే చేసిందట

  నిజానికి కాజల్ కి ఆ ముద్దు సీన్ ఇష్టం లేదనీ సీన్ తప్పని సరి కాబట్టే కాజల్ ని ఒప్పించామనీ అయినా కాజల్ అంగీకారం తెలపక ముందే అసలు విశయం తెలియని రణ్ దీప్ హుడా ఆ సన్నివేశం చివర్లో ముద్దు పెట్టేయటం తో అప్ సెట్ అయిన కాజల్. షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లిపోయి మళ్ళీ లిప్ లాక్ చేయబోనని కండిషన్ పెట్టడంతోపాటు సినిమాలో ఆ సీన్ ఉండకూడదని కూడా చెప్పిందనీ చెప్పాడు.

  అలా అనిపించటం లేదే

  అలా అనిపించటం లేదే

  ఇదేదో మూడ్ లో క్యారీ అయిపోయి రణ్ దీప్ ఒక్కడే ముద్దెట్టేశాడు అన్నట్లు మాత్రం లేదు. తనకంటే హైట్ ఉన్న రణదీప్ హుడాను. కాజల్ కాస్త పైకి లేచి మరీ మెడ చుట్టూ తన చేత్తో కావలించుకుని. చాలా రొమాంటిక్ గా, చాలా ఇష్టం తో ముద్దు పెట్టుకున్నట్టే కనిపిస్తోంది

  కొరియన్ సినిమా రీమేక్

  కొరియన్ సినిమా రీమేక్

  "ఆల్వేస్" అనే కొరియన్ కొరియన్ సినిమా కి రీమేక్ అయిన ఈ సినిమాకి, ఈ "ఇష్టం లేని ముద్దు కథని" కూడా కలిపి తెగ ప్రమోట్ చేస్తున్నారు. బాలీవుడ్ కంటే టాలీవుడ్ లో నే కాజల్ ముద్దు తో అయినా ఈ హిందీ సినిమాకు మాంచి ఓపెనింగ్స్ వస్తాయేమో అనుకుని ఉంటారా..!

  ఇదీ మొదటిసారే

  ఇదీ మొదటిసారే

  కాజల్ ఈ సినిమాలో మొదటి సరి అంధురాలిగా నటిస్తోంది. ఈ పాత్ర కోసం కొందరు అందులతో కలిసి కొన్ని రోజులపాటు ప్రతీ రోజూ కొన్ని గంటలు అందులతో గడిపిందట కాజల్.

  లవ్ స్టోరీ

  లవ్ స్టోరీ

  ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కీ ఒక అంధ యువతికీ మధ్య ఉన్న ప్రేమకథే ఈ "దో లఫ్జోంకీ కహాని". రణ్ దీప్, కాజల్ తమ పాత్రల్లో ఒదిగిపోయారట.

  పోరాటాల శిక్షణ :

  పోరాటాల శిక్షణ :

  ఆలియాభట్ హీరోయిన్ గా చేసిన హైవే సినిమాలొ ఒక కిడ్నాపర్ గా.., కొండ ప్రాంతాల యువకుడిగా కనిపించిన రణ్ దీప్ ఈ సినిమా కోసం తన బాడీని ఒక రేంఝ్ లో మార్చుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకున్నాడట.

  ఇంకో బ్రేక్ పాయింట్:

  ఇంకో బ్రేక్ పాయింట్:

  హైవేలో రణ్ దీప్ హుడా నటనకి బాలీవుడ్ విమర్శకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు కూడా అదే స్థాయి నటన కనబరుస్తాడనీ అతని కెరీర్ లో ఇదో మైలు రాయి ఔతుందనీ చెబుతున్నాడు డైరెక్తర్ దీపక్ తిజోరీ.

  ఏమౌతుందో మరి:

  ఏమౌతుందో మరి:

  దేశవ్యాప్తంగా ఈనెల 10న విడుదల అవబోతున్న ఈ సినిమా కాజల్ కీ రణ్ దీప్ కీ ఎంతవరకూ ప్లస్ అవుతుందో చూడాలి మరి. కాజల్ ఈ సిన్మాతో బాలివుడ్ లో నిలదొక్కుకుంటుందో లేక మళ్ళీ టాలీవుడ్ బాట పడుతుందో త్వరలో తెలియనుంది.

  English summary
  Kajal Aggarwal Controversial lip lock in "Do Lafzon Ki Kahani" Official Trailer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X