twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న డాక్టర్ సత్యమూర్తి- నిర్మాత డి.వెంకటేష్

    |

    యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల చేస్తున్నారు డి.వెంకటేష్. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేష్‌ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముచ్చటించారు. సబ్జెక్ట్‌ బాగుంటే అది ప్రజలకు నచ్చితే ఏ బాషైనా సరే తప్పకుండా ఆదరిస్తారని అనేకసార్లు రుజువైందని నిర్మాత వెంకటేష్ చెప్పారు.

    రహమాన్‌ (రఘు) టైటిల్‌ పాత్ర పోషించిన ఈ చిత్రం తమిళ నాడులో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రెజెంట్‌ జనరేషన్‌కు కనెక్ట్‌ అయ్యే స్టోరీ కనుక, ఇది యువతీయువకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షించింది. హైదరాబాద్‌తో కలిపి వందకు పైగా కేంద్రాల్లో విడుదల చేస్తున్నాము. పాజిటివ్‌ రెస్పాన్స్‌ ఉంది. ఫేస్‌బుక్‌లో ఫేక్‌ ఐడిని క్రియేట్‌ చేసి టీనేజ్‌ అమ్మయిలను లొబర్చుకొనే డాక్టర్‌ చేసే వికృత చేష్టలకు ప్రతిరూపం ఈ చిత్రం. మధ్యవయస్కుడైన సైకాలజిస్ట్‌ డాక్టర్‌ టీనేజీ అమ్మాయిలను ఎలా లోబర్చుకున్నాడు, ఎలా మభ్యపెడుతున్నాడు, ఎలా తన బుట్టలో వేసుకుంటున్నాడన్న ఇతివృత్తంతో ఆద్యంతం ఈ చిత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించి నప్పుడే ఖచ్చితంగా తెలుగులో కూడా ఆ రేంజ్‌ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో రొమాన్స్‌ సన్నివేశాలు ఉంటాయి కానీ అవి వల్గర్‌గా లేకుండా కథానుసారంగా వుంటాయి. యూనివర్సిల్‌ సబ్జెక్ట్‌ని బాషా భేదం లేకుండా అందరూ ఆదరిస్తున్నారనే నమ్మకంతోనే ఈ చిత్రాన్ని కొన్నాను. నా నమ్మకం వమ్ము కాలేదు.

     doctor satyamurthy movie releasing on june 2nd!

    వరుసగా డబ్బింగ్‌ సినిమాలే చేయటానికి కారణం ఉంది. మొదట్లో నేను స్ట్రెయిట్‌ చిత్రాలు చేసేందుకే చిత్రరంగంలోకి ప్రవేశించాను. కానీ ఈ రోజు పరిస్థితి స్ట్రైట్‌ సినిమా చేయాలంటే మినిమం రూ.3కోట్లు -రూ. 10 కోట్లు కావాల్సిందే. అదే ఒ డబ్బింగ్‌ చిత్రమైనే తక్కువ మొత్తంలో రైట్స్‌ తీసుకొని విడుదల చేసుకునే అవకాశం ఉంటుంది. నేను చేసే తమిళ చిత్రాలు కూడా అక్కడ భారీ బడ్జెట్‌తో నిర్మించినవే. తెలుగులోకి వచ్చేటప్పటికి అవి డబ్బింగ్‌ చిత్రాలుగా అనిపిస్తున్నాయి. భవిష్యత్తులో స్రైయిట్‌ సినిమాలు చేస్తే పెద్ద హీరో కాల్షీట్లు దొరికిన తరువాతే.
    నేను అందించబోతున్న సినిమాల్లో 'తారామణి' చిత్రం ఈ నెల 8వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రం 'మహానటి' రేంజ్‌లో ఉండి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇక పిజ్జా -2 చిత్రం ఈ నెలాఖరులో ఉంటుంది. ఇది కూడా వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న చిత్రమే. తమిళంలో సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రాలను మాత్రమే నేను తెలుగులో తెస్తున్నాను. కాబట్టి ప్రేక్షకులు నిస్సందేహంగా మా బ్యానర్‌లోని చిత్రాలను చూడవచ్చు. నాకు తెలిసిందేంటంటే ఇదివరకు థియేటర్ల కొరత అనుకునేవాడ్ని. కానీ ఇప్పుడర్థం అవుతుంది.

    1వ తేదీ విడుదలైన విశాల్‌ నటించిన 'అభిమన్యుడు' కూడా సక్సెస్‌ బాటలో ఉన్నట్లు తెలిసింది.
    చిన్న సినిమా అనే చిన్నచూపును పక్కనబెట్టి మీరు మీ కుటుంబం తో ఈ చిత్రానికి వెళ్ళితే, మీరు పెట్టిన డబ్బుకి రెట్టింపు ఆనందాన్ని పొందుతా రని గట్టిగా చెప్పగలను అన్నారు 'డాక్టర్‌ సత్యమూర్తి' చిత్ర నిర్మాత డి. వెంకటేష్‌. నేటి జెనరేషన్‌లో టెక్నాలజీ ఊపందుకుని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, లాంటి వాటిని కొందరు మాయగాళ్ళు అందమైన అబ్బాయి ఫోటో పెట్టి పేస్‌ బుక్‌ ఫేక్‌ ఐడీని సృష్టించి అమ్మాయిలతో ఛాటింగ్‌ మొదలు పెట్టి మెల్లగా బుట్టలో వేసుకొని ముగ్గులోకి దించి దర్జాగా ఎస్కేప్‌ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళ పట్ల నేటి యువతులు జాగ్రత్త వహించాలన్న సందేశంతోనూ ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశమూ ఆకట్టుకుంటుందని గ్యారంటీ గా చెప్పవచ్చు. కేవలం ఏదో చిన్న సినిమా అనే భావనతో ఈ చిత్రాన్నేం చూస్తాంలే అనుకోకండి. మీకు ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్‌ తప్పక కలుగుతుంది. ఈ సినిమాపై మీరు పెట్టే ఒక్క పైసా కూడా వృధా కాదన్న నమ్మకంతో చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చు.

    English summary
    Rahman's recent Tamil blockbuster film is releasing in Telugu as 'Dr Satyamurthy'. D Venkatesh is releasing the Telugu version under Yaswanth Movies Banner. Senior actor Rahman who was seen in several Telugu films had made banging comeback as lead actor with D-16
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X