»   » బాలు 50 ఏళ్ల నుంచి పాడుతున్నారు.. చట్టాలు తెలియవా? ఇళయరాజా విచిత్రం..

బాలు 50 ఏళ్ల నుంచి పాడుతున్నారు.. చట్టాలు తెలియవా? ఇళయరాజా విచిత్రం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంగీత దిగ్గజాలు ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం మధ్య చోటుచేసుకొన్న లీగల్ నోటీసుల వివాదంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. నేను స్వరపరచిన గీతాలు పాడటం సరికాదు. వేదికల మీద నా పాటలు పడేందుకు తప్పనిసరిగా నా అనుమతి ఉండాల్సిందే అని బాలుకు ఇళయరాజా నోటీసులు పంపడం ప్రస్తుతం మ్యూజిక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

రాయల్టీ కోరే హక్కు ఉంటుంది

రాయల్టీ కోరే హక్కు ఉంటుంది

‘సింగర్స్‌, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌కుత తమ పాటలకు సంబంధించి రాయల్టీ కోరే హక్కు ఉంటుంది. వ్యాపార, లాభాపేక్షతో సంగీత విభావరి నిర్వాహకులు రాయల్టీ చెల్లించాలి. ఇందుకోసం 1969లో ది ఇండియన్‌ పెర్‌ఫార్మెన్స్‌ రైట్స్‌ సొసైటీ (ఐపీఆర్‌ఎస్‌) ఏర్పడింది.

రాయల్టీ చెల్లించాలి

రాయల్టీ చెల్లించాలి

ఐపీఆర్ఎస్ ఓ ప్రైవేటు రిజిస్టర్డ్‌ సంస్థ. దీని నిబంధనల ప్రకారం టికెట్‌ వసూలు చేస్తూ సంగీత విభావరి నిర్వహిస్తే రాయల్టీ చెల్లించాలి. ఎవరి నుంచైనా అభ్యంతరం వ్యక్తమయితే వారి పాటలు పాడకూడదు అనే నిబంధనలు పొందుపరిచారు. గతంలో ఆల్‌ ఇండియా రేడియో, దూరదర్శన్‌లలో ప్రోగ్రామ్స్‌కు రాయల్టీలు ఇచ్చేవారు.

ప్రముఖుల అభిప్రాయాలు

ప్రముఖుల అభిప్రాయాలు

గతంలో లతామంగేష్కర్‌ తన పాటలకు రాయల్టీ కోరారు అనే విషయాన్ని కొందరు సంగీత ప్రముఖులు గుర్తు చేస్తున్నారు. ఈ వివాదంపై ఐపీఆర్‌ఎస్‌ స్పందించాల్సి ఉంది. దీనిపై సునీత, రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరాం లాంటి సంగీత ప్రముఖులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇళయరాజాకు అధికారం ఉంది

ఇళయరాజాకు అధికారం ఉంది

చట్టప్రకారం ఇళయరాజాకు నోటీసు ఇచ్చే అధికారం ఉంది. కానీ బాలు యూఎస్‌లో పాడే సమయంలోనే ఎందుకు ఇచ్చారో? అర్థంకావడం లేదు. 50 ఏళ్లకుపైగా పాటలు పాడుతున్న బాలసుబ్రహ్మణ్యానికి ఐపీఆర్‌ఎస్‌ గురించి తెలీదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తప్పుపట్టలేం

తప్పుపట్టలేం

చట్టపరంగా బాలుకు ఇళయరాజా నోటీసులు ఇవ్వడంపై తప్పుపట్టలేం. కానీ ఆయన చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇవ్వడమే విచిత్రమని పేర్కొన్నారు. వారిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే సమస్య సమసిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.

English summary
Maestro Ilayaraja served Legal Notices to legendary singer SP Balasubramanyam asking him not to perform his songs at public events without his consent. There are questions rising about royaly for singers, music directors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu